NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇంత స్ట్రాంగ్‌గా ఉన్న వైసీపీకీ అక్క‌డ క్యాండెట్లు క‌రువా… చివ‌ర‌కు ఆ మ‌హిళా నేతే పోటీలో ఉంటుందా..!

ఉమ్మ‌డి విశాఖ‌ప‌ట్నం జిల్లాలోని కీల‌క‌మైన గాజువాక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయబోయే అభ్యర్థిపై వైసీపీలో తర్జనభర్జన కొనసాగుతోంది. సిటింగ్‌ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి ఉన్నారు. సర్వేలు, స్థానికంగా ఉన్న అంశాలను పరిగణలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం వచ్చే ఎన్నికల్లో నాగిరెడ్డికి టికెట్‌ ఇచ్చేందు కు నిరాకరిస్తోంది. ఈ క్రమంలోనే కార్పొరేటర్ వ‌రికూటి రామచంద్రరావును గాజువాక ఇన్‌చార్జ్‌గా కొద్దిరోజుల కిందట నియమించారు.

candidates for YCP which is so strong... Will that woman leader
candidates for YCP which is so strong… Will that woman leader

ఈ నిర్ణయాన్ని సిటింగ్‌ ఎమ్మెల్యే నాగిరెడ్డి వ్యతిరేకించినా అధిష్టానం ప‌ట్టించుకోలేదు. అయితే, రామచం ద్రరావు అభ్యర్థిత్వంపై మంత్రి బొత్స సత్యనారాయణ అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగు తోంది. గాజువాక అభ్యర్థిని మార్చాలని వైసీపీ అధిష్టానానికి బొత్స సూచించారని నాయ‌కులు చెబుతున్నా రు. వ‌రికూటి రామ‌చంద్రరావు బలహీనమైన అభ్యర్థి ఉన్నాడని బొత్స స‌త్య‌నారాయ‌ణ భావిస్తున్నట్లు తెలుస్తోంది. స్థానికంగా ప్ర‌జ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ.. ఓటు బ్యాంకును అనుకూలంగా మార్చుకోవ‌డంలోనూ ఆయ‌న‌పై సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థిని మార్చాల‌న్నది మంత్రి బొత్స ఆలోచ‌న‌గా ఉంది. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం ప‌రిస్థితిని గ‌మ‌నిస్తే.. గాజువాకలో యాదవ సామాజికవర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న తిప్పల నాగిరెడ్డి ఆర్థికంగా బలమైన వ్యక్తి. ఆయనను వద్దనుకున్న పక్షంలో యాదవ సామాజికవ ర్గానికి చెందిన ప్రస్తుత విశాఖ నగర మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారిని బరిలో దించాలని బొత్స భావిస్తున్నారు.

ఈ మేరకు అధిష్టానానికి ఆయన సూచించినట్టు చెబుతున్నారు. మేయర్‌గా సమర్థవంతంగా పని చేయడంతోపాటు రాజకీయంగా వివాదాలకు అతీతంగా ఆమె వ్యవహరిస్తూ వస్తున్నారనేది బొత్స గ్రూప్ మాట‌. ఏళ్ల తరబడి పార్టీలోనే పని చేస్తుండడం కూడా వీరికి కలిసి వచ్చే అంశం. బొత్స ఆశీస్సులు కూడా ఉండడంతో ఆమె పేరు ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యే ఆమెకు ఏమేర‌కు స‌హ‌క‌రిస్తార‌నేది మ‌రో ప్ర‌శ్న‌. మొత్తంగా చూస్తే.. గాజువాక వైసీపీలో అభ్య‌ర్థి ఎంపిక గ‌డ‌బిడ‌గానే మారింది. మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి.

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N