Niharika: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎంతటి పరువు ప్రతిష్టలు ఉన్నాయో మనందరికీ తెలిసిందే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరో హీరోయిన్ల కొడుకులే కాదు సాధారణమైన మనుషులు కూడా ఇండస్ట్రీకి అడుగుపెట్టి స్టార్ హీరోగా గుర్తింపు పొందొచ్చు అనే మాటకి అర్థం చెప్పాడు చిరంజీవి.
ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి అనేకమంది హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ ఇలా పలువురు మెగా హీరోలు ఇండస్ట్రీకి అడుగుపెట్టి మంచి గుర్తింపును సైతం సంపాదించుకున్నారు. అదేవిధంగా నాగబాబు కూతురు నిహారిక సైతం ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ పెద్దగా పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది.
దీంతో పెళ్లి బంధంలోకి అడుగు పెట్టింది నిహారిక. ఇక ఆ బంధాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఇటీవలే ఓ నిర్మాణ సంస్థను స్థాపించింది. మరి ఈ రంగంలో అయినా కొనసాగుతుందో లేదో చూడాలి. ఇక తాజాగా నిహారిక మరియు నాగబాబుల కి సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. తండ్రి జగన్ పరువు తీస్తుంటే కూతురు తండ్రి పరువు తీస్తుంది.
ఎస్ మీరు విన్నది నిజమే. గతంలో నాగబాబు ” వెంకటేశ్వర స్వామి ప్రసాదాలు టిష్యూ పేపర్లో చుట్టి పక్కన పెట్టే మీకెందుకండీ రామాయణ మహాభారత ఉదాహరణలు..” అంటూ జగన్ భార్యపై ఓ ట్వీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ ట్వీట్ ని ట్యాగ్ చేస్తూ గతంలో పోలీస్ రైడ్ లో పట్టుబడ్డ నాగబాబు కూతురు వీడియోని కూడా ట్యాగ్ చేస్తూ ఓ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇది చూసిన వారంతా..” బయట వారి పరువు నాగబాబు తీస్తుంటే నాగబాబు పరువు నిహారిక తీస్తుంది . ముందు మీ ఇంట్లో వారిని క్రమ పద్ధతిలో పెట్టుకోండి ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.