NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

BJP: విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహా సంఘటన ప్రధాన కార్యదర్శి శివ ప్రకాష్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జి అరుణ్ సింగ్, ఇన్ చార్జి సిద్ధార్థ నాధ్ సింగ్ పాల్గొన్నారు. తాజాగా బీజేపీ ఎంపీ టికెట్ లు దక్కించుకున్న నేతలు హజరైయ్యారు.

ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లాలని జాతీయ స్థాయిలో పార్టీ తీసుకున్న నిర్ణయమని, ప్రస్తుత పరిస్థితుల్లో మూడు పార్టీల కలయిక చారిత్రాత్మక అవసరమని పురందేశ్వరి తెలిపారు.

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తును ఆమె త్రివేణి సంగమంతో అభివర్ణించారు. పొత్తుల వల్ల పార్టీలో చాలా మంది ఆశావహులకు నిరాశ ఎదురైందన్నారు. కానీ రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పొత్తులతో వెళ్లాలని పార్టీ అధిష్టానం భావించిందని చెప్పారు. అయితే..ఈ బీజేపీ పదాధికారుల సమావేశానికి పలువురు సీనియర్ నేతలు డుమ్మా కొట్టడం హాట్ టాపిక్ అయ్యింది.

బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు, సీనియర్ నేతలు విష్ణువర్థన్ రెడ్డి, సత్యకుమార్ లు ఈ సమావేశానికి గైర్హజరు అయ్యారు. ఎన్నికల్లో సీట్లు ఆశించిన ఈ నేతలు భంగపడ్డారు. కీలక సమావేశానికి వీరు డుమ్మా కొట్టడంపై నేతల్లో చర్చ నడుస్తొంది. ఇప్పటికే లోక్ సభ సీటు దక్కకపోవడంపై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. అనుచరులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని అన్నారు.

ఇప్పటికే బీజేపీ ఆరు లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించగా, పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాల్సి ఉంది. అసెంబ్లీ అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసిన బీజేపీ.. నేడో రేపో అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరిన వారికి అవకాశం కల్పిస్తూ.. పార్టీలో సుదీర్ఘ కాలం పని చేస్తున్న వారికి మొండి చేయి ఇస్తున్నారన్న టాక్ నడుస్తొంది. దీనిపై పార్టీ అధిష్టానం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

BRS MLC Kavitha: ఇది పొలిటికల్ లాండరింగ్ కేసు అంటూ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు .. మధ్యంతర బయిల్ పై ఏప్రిల్ 1న విచారణ

Related posts

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!