నాగ్ వెనకడుగు వేశాడా? సంక్రాంతి రేస్ నుంచి తప్పుకున్నాడా? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే టాక్. `సోగ్గాడే చిన్నినాయన` విడుదలైన్పటి నుంచీ నాగార్జున సంక్రాంతి బరిమీద ఓ కన్నేసి ఉంచుతున్నారు. 2020లోనూ ఆయన `బంగార్రాజు`తో బరిలోకి దిగుతారనే టాక్ నడిచింది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన `సోగ్గాడే చిన్నినాయన`కు ప్రీక్వెల్‌గా రూపొందనుంది `బంగార్రాజు`. `మన్మథుడు2` తర్వాత `బంగార్రాజు` సెట్లోకి నాగార్జున జాయిన్ అవుతారనే టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు అది సాధ్యపడేలా లేదట. ఎందుకంటే `మన్మథుడు2` తర్వాత నాగార్జున బిగ్ బాస్ షోలో పాల్గొంటారు. దాదాపు అక్టోబర్ మధ్యలో వరకు బిగ్‌బాస్2 టీమ్ కి ఆయన ప్రతివారమూ అందుబాటులో ఉండాలి. దానివల్ల ఆయన హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలి. కానీ బంగార్రాజు ఎక్కువగా పల్లెటూరి సబ్జెక్ట్. ఒకవేళ సెట్ వేసి చిత్రీకరించినప్పటికీ రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసి, ఆ టార్గెట్‌ని రీచ్ కావడానికి ఆయన పరుగులు తీయడం… ఇవన్నీ ప్రాక్టికల్‌గా ఎంతవరకు సక్సెస్ అవుతాయి.. ఈ విషయం గురించి టీమ్ పునరాలోచిస్తోందని వినికిడి. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ సంస్థ పతాకంపై నాగార్జున నిర్మించడం కొసమెరుపు.
previous post
next post