సెప్టెంబర్ 2… పవర్‌స్టార్, జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు. సోషల్ మీడియాలో సినీ ప్రముఖులందరూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ బాబాయ్‌ని బాగా ఇష్టపడే అబ్బాయ్ రామ్‌చరణ్ ప్రత్యేకంగా కలిసి పుట్టినరో్జు శుభాకాంక్షలు తెలిపారు. వీరిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను తన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన రామ్‌చరణ్ “నా ఫ్రెండ్, మెంటర్, గైడ్‌గా ఉన్నందుకు థ్యాంక్స్. పుట్టినరోజు శుభాకాంక్షలు కల్యాణ్బాబాయ్. లవ్ యు సోమచ్` అంటూ మెసేజ్‌ను కూడా పోస్ట్ చేశారు రామ్‌చరణ్. ఈ సందర్భంగా వీరిద్దరు కలిసి ఉన్న ఫొటోలను అభిమానులు లైక్ చేస్తున్నారు.
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!