మొన్న బుద్ధి గడ్డి తిని టీవీ పెట్టేను
ఓ చిన్న అమ్మాయి డాన్స్ చేస్తోంది
మహా ఐతే పదేళ్లు ఉంటాయి
చిన్న పరికిణి చిన్న జాకెట్
క్లబ్ డాన్సర్ మేకప్పు పాటా అదే
ఆ పిల్లకి ఆ పాట అర్థం తెలీదు
డాన్స్ తెలీదు
ఎవరో గెంతమంటే గెంతుతోంది
ఊపడానికి ఏవీ లేకపోయినా ఒళ్ళంతా ఊపేస్తోంది
నాకు ఓ రకమైన జుగుప్స
టీవిలో కనిపించాలన్న ఈ పిచ్చి ఏవిటి
అమ్మానాన్నలు తెగ పొంగిపోతున్నారు
ఏవిటిది
గేమ్ షో ట
వీటిని రియాలిటీ షో అంటారట
ఇది రియాలిటీనా రియాలిటీకి అర్థం తెలుసా
షోకి జడ్జిలు ఉండాలికదా
ముగ్గురు ఉన్నారు
ఎవరు సర్ వాళ్ళు
ఒక రచయిత ఒక తార లేక తారడు.
సాడే తీన్ సినిమాలకి సంగీతమో ఏదో ఇచ్చిన దర్శకుడు
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి లాగా
అప్పుడప్పుడు ఓ స్పెషల్ గెస్ట్
అందరూ మాజీలే
ముందు టీవిలో కనిపిస్తే తరవాత సినిమా ఛాన్స్ వస్తుందని
ఆ పిల్లల అమ్మ నాన్నల ఆశ
అది ఆశ కాదు దురాశ
సినిమాకి మొదటి మెట్టు టీవీ కదా
కానీ ఆ జడ్జిలు వీళ్ళని చీల్చి చెండాడుతారు
ఆ పిల్లలు అక్కడే భోరున ఏడుస్తారు
ఏవి దౌర్భాగ్యం
ఆ జడ్జిల్లో సంగీత జ్ఞానం గాని డాన్స్ గురించి అవగాహన గాని ఉందా
సినిమాలో ఆ కొరియోగ్రాఫర్ ఎలా గెంతమంటే ఆలా గెంతుతారు
కానీ సార్ అభం శుభం తెలీని పిల్లల్ని ఏడిపించడం న్యాయవా
ఓ మంచి క్విజ్ పెట్టండి
ఒకప్పుడు స్కూల్ లోను కాలేజీలోనూ క్విజ్లు ఉండేవి
వాటివల్ల జ్ఞానం పెరుగుతుంది
పిల్లలు చదివి వస్తారు
ఇప్పుడూ ఉంటున్నాయి
సినిమా క్విజ్లు
పోటీ ప్రపంచం అన్నమాట ఊతపదం అయిపోయింది
పోటీ దేనికి
ఎవరి ప్రతిభ వాళ్ళకి ఉంటుంది
అందరికీ ఫస్ట్ రాదుకదా
రానివాళ్లు అక్కడే ఏడుపులు
డిప్రెషన్లోకి వెళ్లడం
వీటికి సెన్సార్ ఉండాలి
అఫ్కోర్స్ సెన్సార్ ఉన్న సినిమాలు మాత్రం ఎలా ఉంటున్నాయి
హింస తప్ప మరేవీ లేదు
మళ్ళీ నేను చెప్పిందే చెప్తున్నాను
తప్పు అమ్మ నాన్నలిది
బుద్ధి ఉండొద్దూ
మీ పిల్ల టీవిలో కనిపించాలంటే సంగీతం నేర్పించండి
లేదా డాన్స్ నేర్పించండి
అంతేగాని ఈ దిక్కుమాలిన షో లకి పంపకండి
వాళ్ళకి చిన్నప్పుడే గ్లామర్ అలవాటు చెయ్యొద్దు
అది భయంకరవైన వ్యసనం
పిల్లల్ని మనవే చెడగొడుతున్నాం
సమాజం చెడిపోతోందని గోల పెడితే కాదు
మనవే చెడగొడుతున్నాం
టాలెంట్ ఉన్నవాళ్ళకి ఏ షోలూ అక్కర్లేదు
లేనివాడిని అవి ఉద్దరించవు
అమ్మా తల్లులూ మీ పిల్లలకి కావాల్సింది గ్లామర్ కాదు
మంచి అలవాట్లు
మంచి నడవడి
ముందు మీరు మారండి
మీపిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది
ఆలోచించండి
బీనా దేవి
previous post
next post
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ