Chiranjeevi: సాధారణంగా ఎవ్వరైనా ఏ పనిలో బిజీగా ఉన్న.. సంక్రాంతి అనగానే తమ పనులన్నీ ముగించుకుని ఎంజాయ్ చేయడానికి రెడీ అవుతారు. ఈ కోవా కి చెందిన వారే మెగా ఫ్యామిలీ కూడా. మెగాస్టార్ చిరంజీవికి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన సత్తా నిరూపించుకున్నాడు.
అంతేకాకుండా తన అన్నదమ్ములని వాళ్ల పిల్లలని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. ఇక వాళ్లకి కూడా సూపర్ పాపులారిటీ దక్కిందని చెప్పొచ్చు. ఇక తాజాగా మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి సంబరాలను అంగరంగ వైభోగంగా జరుపుకున్న సంగతి తెలిసిందే. మూవీస్ విషయంలో ఎంత బిజీగా ఉన్నప్పటికి పండగలు వచ్చాయి అంటే చాలు ఇంట్లో వాలిపోతారు మన మెగా హీరోలు.
ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబంతో ఆనందంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగా చిరంజీవి తన కుటుంబ సభ్యులతో సంక్రాంతి ఓ ఫామ్ హౌస్ లో జరుపుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ ఫామ్ హౌస్ బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవనహళ్లిలో ఉందని తెలుస్తుంది.
ఇక దీని విలువ అక్షరాల రూ. 30 కోట్ల రూపాయలట. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. మరికొందరు మాత్రం..” ఈయన రేంజ్ సీఎం కి కూడా ఉండదేమో.. బతికితే ఇలా బతకాలి రా. సంపాదించుకున్నాడు ఖర్చు చేస్తున్నాడు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి తాజాగా ” విశ్వంభర ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక వరుస ఫ్లాప్ లతో ఉన్న చిరుకి ఈ మూవీ కనుక హిట్ కొడితే కెరీర్ పూర్తిగా మారిపోతుందనే చెప్పొచ్చు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!