NewsOrbit
రాజ‌కీయాలు

పవన్ దీక్షకు రాపాక దూరం!

అమరావతి: రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’ కార్యక్రమానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దీక్షకు రాపాక హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలోనే ఆయన రాలేదని పార్టీ నేతలు చెబుతున్నారు.

మరోవైపు రాపాక పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం లేదనే ప్రచారం కూడా జరుగుతోంది. రాపాక అధికార పార్టీకి దగ్గర అయ్యేందుకు ఉత్సాహం చూపుతున్నారని, త్వరలోనే పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు బదులు కేవలం ఇంగ్లీష్ మీడియం మాత్రమే ప్రవేశపెట్టడంపై పవన్ కల్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే, రాపాక మాత్రం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే. పేద విద్యార్థుల కోసం వైసిపి ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందంటూ కితాబు ఇచ్చారు.  జనసేన అధినేత నిర్ణయానికి విరుద్ధంగా ఆ పార్టీ ఎమ్మెల్యే రాపాక ప్రభుత్వ చర్యలను అసెంబ్లీలో  సమర్థించడం జనసేన శ్రేణులను అయోమయానికి గురి చేసింది.

ఇదిఇలా ఉంటే.. తనకు జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌కు మధ్య బేధాభిప్రాయాలు ఉన్నాయని ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. అయితే తమ మధ్య ఉన్న గ్యాప్ త్వరలోనే తొలిగిపోతుందని భావిస్తున్నట్టు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం లేకపోతే ఉన్న ఇబ్బందుల తనకు తెలుసని, చాలా మంది దళితులు పైవేటు పాఠశాలలో చదవలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడాన్ని తాను స్వాగతించానని వివరించారు. తనలాగే పార్టీకి సంస్థాగత నిర్మాణం చేసి ఉంటే జనసేన అభ్యర్థులు గెలిచేవారేమోనని రాపాక వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలుపు కోసం తాను నియోజకవర్గంలో కమిటీలు ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు.

Related posts

TS Cabinet Meeting: తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్ .. కానీ..

sharma somaraju

Arvind Kejrival: ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన సీఎం కేజ్రీవాల్.. బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు

sharma somaraju

దెందులూరులో టీడీపీ ప్ర‌భాక‌ర్ గెలిచేస్తాడా… వైసీపీ అబ్బ‌య్య చౌద‌రి గెలుస్తాడా ?

ఇది క‌దా.. చంద్ర‌బాబుకు – జ‌గ‌న్ బాబుకు తేడా ఇదే…!

టీడీపీలో త‌మ్ముడి దెబ్బ‌తో కూతురికి బిగ్ షాక్ త‌గ‌ల‌బోతోందా ?

ఉండిలో దంచేశారు.. ర‌ఘురామ‌కు ద‌డ‌ద‌డ‌.. గ‌డ‌బిడే…?

Chandrababu: అమెరికా వెళ్లిన చంద్రబాబు దంపతులు .. ఎందుకంటే..?

sharma somaraju

ఏపీలో ఎవ‌రు గెలిచినా.. ఎవ‌రు ఓడినా… వీరికి మంత్రి ప‌ద‌వులు…!

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

Leave a Comment