NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టిడిపి,వైసిపి శ్రేణుల మధ్య రాళ్ల దాడి

కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెదఓగిరాలలో జన్మభూమి కార్యక్రమం టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య ఘర్షణకు దారి తీసింది. టిడిపి ఎమ్మెల్యే బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ లు జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న సమయంలో వైసిపి నేత పార్థసారథి ఆ కార్యక్రమం వద్దకు వచ్చేందుకు యత్నించారు. ఆయనని టిడిపి కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించిన క్రమంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే…గురువారం ఉయ్యూరులో జన్మభూమి కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్, పార్థసారథిల మధ్య పరస్పరం మాటల యుద్దం నేపథ్యంలో ఉద్రిక్తత చోటుచేసుకున్నసంగతి  తెలిసిందే. దీంతో ఈ సభలో టిడిపి,వైసిపి కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వైసిపి నేత పార్థసారథి పెదఓగిరాలలోని జన్మభూమి కార్యక్రమం వద్దకు కూడా వస్తున్నట్లు తెలియడంతో ఇక్కడ కూడా ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అప్రమప్తమయ్యారు.

ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా పెదఓగిరాల గ్రామానికి చేరుకునేందుకు గాను జాతీయ రహదారి గుండా ప్రయాణించాల్సి ఉండగా…అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పెదఓగిరాల జన్మభూమి కార్యక్రమం లో పాల్గొనేందుకు బయలుదేరి వచ్చిన వైసిపి నేత పార్థసారథిని జాతీయ రహదారిపైనే పోలీసులు అడ్డుకున్నారు.

అయితే మరోవైపు జన్మభూమి కార్యక్రమం నుంచి వెళ్లిపోయే క్రమంలో టిడిపి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అదే సమయంలో అక్కడకు రావడంతో వైసిపి కార్యకర్తలు ఆయన వాహనాన్ని అడ్డుకుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే అనుచరులు, వైసిపి కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతో పోలీసులు వెంటనే స్పందించి ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Leave a Comment