NewsOrbit
సినిమా

అలాంటి పాత్ర చేయాల‌నుంది

సూపర్ స్టార్ రజినీకాంత్.. 45 ఏళ్ల కెరీర్.. 168 సినిమాలు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయన ఎక్కని మెట్టు లేదు. ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. స్టైల్‌కు ఆయనో చిరునామా అయ్యారు. అయితే సినిమాల పరంగా ఆయనకు రెండు కోర్కెలు ఉన్నాయట. ట్రాన్స్‌జెండర్ పాత్రలో నటించాలని ఉందట. అలాగే ఓ మరాఠా చేయాలనుందట. దర్బార్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆయన చెప్పిన మాటలివి. సోమవారం సాయంత్రం దర్బార్ ట్రైలర్‌ను చిత్రబృందం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఏదైనా చేయలేని పాత్ర మీ మదిలో ఉందా అని మీడియా అడగగా.. ట్రాన్స్‌జెండర్ పాత్ర చేయాలనుందని ఆయన అన్నారు. ఎవరైనా ఆ పాత్ర కోసం సంప్రదించారా అని అడగగా.. లేదని.. ఇప్పుడే అలాంటి ఆలోచన వచ్చిందన్నారు. ఇక మరాఠా సినిమా చేసే అవకాశం వచ్చినా.. చర్చలకే పరిమితమైపోయిందన్నారు. రజినీ మూలాలు మహారాష్ట్రకు చెందినవన్న విషయం అందరికీ తెలిసిందే. ఆయన అసలు పేరు శివాజీ రావ్ గైక్వాడ్. బెంగుళూరుకు వలస వచ్చిన వీరి కుటుంబం అక్కడే స్థిరపడిపోయింది. సినిమాల్లోకి వచ్చాక రజినీకాంత్‌‌గా పేరు మారింది. ఆయన గురువు, ప్రఖ్యాత దర్శకుడు బాలచందర్.. ఈ పేరు పెట్టారు. తాను ఇంట్లో ఇప్పటికీ మరాఠీ మాట్లాడుతుంటానని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమాలో రజినీ.. పోలీస్ పాత్రలో నటించారు. దాదాపు 27ఏళ్ల తర్వాత పోలీస్‌గా మెప్పించేందుకు సిద్ధమయ్యారు. పోలీస్ పాత్రల్లో సీరియస్‌నెస్ ఉంటుందని.. అందుకే ఆ పాత్రలపై పెద్దగా ఆసక్తి చూపనన్నారు. జాలీగా నడిచిపోయే పాత్రలు చేయాలంటేనే తనకు ఇష్టమన్నారు. మురుగుదాస్ డైరెక్షన్‌లో రూపుదిద్దుకున్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీత దర్శకత్వం వహించారు.

 

 

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Leave a Comment