NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

కరణం పాచిక పారట్లేదు…!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

కండువా మార్చేస్తే పెత్తనం వచ్చేస్తుందా…! స్థానిక బలం, బలగం అవసరం లేదా…?

పార్టీ మారితే అధికారం సొంతమవుతుందా..?
శ్రేణులు పూర్తిగా కలుపుకోవాల్సిన అవసరం లేదా…?

కరణం టీడీపీలో చేరారు, సరే. మరి ఆయనకు దక్కిన హోదా ఏంటి..? ఆయనకు స్థానికంగా వచ్చిన అపవాదు ఏంటి..? కుమారుడి భవిష్యత్తు, డెబ్భై ఏళ్ల వయసులో అధికార వ్యామోహం కలగలిసి కరణం బలరాంని టీడీపీ నుండి వైసీపీలోకి వచ్చేలా చేశాయి. కానీ ఇది చీరాలలోనే కాక, ప్రకాశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ జగన్ ని కలిసి చేరిన మరుసటి రోజునే వారి దాహపు గొంతులో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పచ్చి వెలక్కాయ వేశారు. నేరుగా సీఎం జగన్ని కలిసి చీరాలలో పరిణామాలు, వారి పాత్ర, తన పాత్రపై స్పష్టత తీసుకున్నారు. జగన్ ఇచ్చిన హామీతో ధీమాగా బయటకు వచ్చి ఎప్పటిలాగానే టీడీపీని ఏకిపారేశారు. ఇక్కడే “స్థానిక ఎన్నికల్లో వారి అభ్యర్థులను గెలిపించి పార్టీలోకి రావాల్సింది” అంటూ కీలక పాయింటుని బలంగా వినిపించారు. నిజమే ఆయన చెప్పిన అంశంలో పాయింట్ ఉంది. స్థానిక ఎన్నికల్లో పార్టీ కంటే, లోకల్ నాయకత్వానికే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే కరణం నాయకత్వంతో తమ వారిని గెలిపించి తీసుకువచ్చి, జగన్ని కలిసి పార్టీలో చేరితేనే బలం తేలేది.
నక్క తోక గెలుపు…!


నిజానికి ఇక్కడ ఒక్కసారి 2019 చీరాల ఎన్నికలను గుర్తు చేసుకోవాలి. నాడు అధికార టీడీపీని ఢీకొట్టి, చంద్రబాబుని, లోకేష్ ని సూటిగా టార్గెట్ చేసి నాటి ఎమ్మెల్యే ఆమంచి వైసీపీలో చేరారు. దీంతో టీడీపీ, నాటి సీఎం చంద్రబాబుకి ఈయన టార్గెట్ అయ్యారు. అందుకే కచ్చితంగా తెలవాల్సిందే అంటూ అభ్యర్థి ఎంపిక నుండి, ఆర్ధిక వనరులు సమకూర్చడం, పోలీసులను దింపేయడం, అధికారులను తమవైపు తిప్పుకోవడం… ఇలా ప్రతిదీ కరణం బలరాంకి అనుకూలంగా చేస్తూ… ఆమంచికి అష్టదిగ్భంధనం చేశారు. నాడు ఆమంచి చేసిన కొన్ని వ్యూహాత్మక తప్పిదాలు వెరసి బలరాం గెలిచారు. నిజానికి ఆమంచికి చీరాల ప్రతి పల్లెలోనూ, ప్రతి వార్డులోనూ మంచి పట్టుంది. సామాన్యులను పేరు పెట్టి పిలవగల చనువు ఉంది. అభివృద్ధి పనులు బాగానే చేశారు. కానీ రాజకీయ శత్రుత్వం కారణంగా ఓటమి పాలయ్యారు. ఇక్కడ బలరాం గెలుపు నక్కతోక తొక్కినట్టే. ఇదేదో తన సొంత ఇమేజ్ తో గెలిచినట్టు, పార్టీ మొత్తాన్ని తానే మోసినట్టు ఫీలవుతూ సంబరాలు చేసుకున్నారు.

అలా అలా… నెలలు గడిచే కొద్దీ తనను గెలిపించిన టీడీపీని, కార్యకర్తలను పట్టించుకోకుండా భవిష్యత్తుపై ఆలోచనలు మొదలు పెట్టారు. స్థానిక ఎన్నికలు అనే సరైన సమయం చూసుకుని… కొన్ని సాకులు చూపి వైసీపీకి మద్దతు ప్రకటించారు. కుమారుడిని చేర్చేశారు. ఇది చీరాలలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఏ ఇద్దరు కలిసినా ఈ మార్పు అంశాన్నే మాట్లాడుకుంటున్నారు. సగటు రాజకీయ అభిమాని మాత్రం “ఇది జగన్ మార్కు మార్పు” అంటూ చెప్పుకొస్తున్నారు.

  • చంద్రబాబుని ఏకాకిని చేయాలి.
  • టీడీపీని నైరాశ్యంలోకి నెట్టేయాలి.
  • నాటి అవినీతి మంత్రిల పని పట్టాలి.
  • రాజకీయంగా వైసీపీ మరింత బలోపేతమవ్వాలి.
    ఇవే జగన్ రాజకీయ లక్ష్యాలు. దీనిలో భాగంగానే టీడీపీ నుండి గెలిచిన వారిని తనకు మద్దతు ఇచ్చేలా చేసుకుంటున్నారే తప్ప నేరుగా పార్టీలో చేర్చుకోవడం లేదు. అంటే వారిని చంద్రబాబుకి, టీడీపీకి దూరం చేసేస్తున్నారు. అలా చేసినట్టే చేసి… తనకు ముందు నుండీ అండగా, తమ పార్టీ తరపున నిలిచిన వారికీ అండగా ఉంటున్నారు. చీరాలలోనూ అదే జరిగింది. టీడీపీ, చంద్రబాబుని నైరాశ్యంలోకి నెట్టేసే కారణంతోనే మార్పు జరిగింది తప్ప… స్థానికంగా ఎటువంటి మార్పులు లేవు. అందుకే అక్కడ ఎప్పటిలాగానే ఆమంచి నాయకత్వంలోనే వైసీపీ ఉంటుంది. ఇదే భరోసాతో ఆమంచి వర్గం మ్రింత్స్ చురుగ్గా స్థానిక ఎన్నికల్లో పని చేస్తుంది. ఈ చేరికతో బలరాం ఆశించిన అద్దంకి, చీరాల పెత్తనం అందుకోవడం మాత్రం ప్రస్తుతానికి లేనట్టే. భవిష్యత్తులో ఎటువంటి మార్పులు ఉంటాయి అనేది చూడాల్సి ఉంది.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

జ‌గ‌న్ కోసం… జ‌గ‌న్ వెంటే… ఆ ఓట‌రే వైసీపీకీ ప్ల‌స్ అయ్యాడా…!

ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ కెరీరే డేంజ‌ర్లో ప‌డిందా..?

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Leave a Comment