NewsOrbit
రాజ‌కీయాలు

జగన్ చేతికి వాళ్ళ లిస్టు – ఇక సాగనంపడమే?

దాదాపు తొమ్మిది ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి జగన్ రాష్ట్ర రాజకీయాలను బాగానే ఒంటపట్టించుకున్నాడు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో సరిగ్గా విశ్లేషించుకుంటూ ముందుకుపోతున్న జగన్ కు రాజకీయ అనుభవం ఉన్నా అనుభవజ్ఞులు ఎవరికి తీసిపోని విధంగా పాలన చేస్తూ ఉన్నాడు. తాత్కాలికంగా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాతనదైన శైలిలో రెచ్చిపోతూ ప్రతిపక్షాలకు తనను దాటేందుకు కూసింత అవకాశం కూడా ఇవ్వకుండా ముందుకుపోతున్న అతనికి తన సొంత పార్టీలో ముసలం పొంచి ఉంది అని ఇప్పటికి అర్థమయింది.

Jagan Angry With YSRCP MLA | Jagan On YSRCP MLA

సహజంగా పవర్ చేతిలో ఉన్న పార్టీలో అది కూడా వైయస్సార్సిపి ఇలాంటి అధికార పక్షంలో నేతలంతా తాము ఇతరులపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదే క్రమంలో వారు ప్రభుత్వాన్ని విమర్శించడానికి కూడా వెనకాడరు. అలాగే ఇప్పుడు వైసీపీలో సీనియర్ రాజకీయ నాయకుల్లో అసమ్మతి పెరిగినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సీనియర్ రాజకీయ నాయకులు జగన్ పై గుర్రుగా ఉండడం…. మీడియా సమావేశాలు నిర్వహిస్తూ బహిరంగంగానే ప్రభుత్వాన్ని మరియు వారి వైఖరిని తక్కువ చేసి మాట్లాడడం గమనిస్తూనే ఉన్నాం.

మొన్నటి ఆనం రాంనారాయణరెడ్డి నుండి నిన్నటి ఎంపీ రఘురామకృష్ణంరాజు వరకు జగన్ పైన మరియు అతని ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్న వారి సొంత పార్టీ నాయకులు ఇలా చేయడంతో జగన్ ముందు కొద్దిగా సందిగ్ధంలో పడ్డాడు. కాని చివరికి వారందరికీ చెక్ పెట్టే విధంగా కీలక అడుగులు వేస్తున్నట్లు వైసిపి వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఎంతో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉన్న వీరంతా జగన్ ఏదో తమ పై ఆధారపడి పార్టీని నడుపుతున్నాడు అన్నట్లు ప్రవర్తించడం జగ కు నప్పట్లేదు. జగన్ ఏనాడూ సీనియర్ రాజకీయ నాయకుల పైన ఆధారపడింది లేదు. అతని టీం లో కూడా ఎక్కువగా యువ నాయకులు దర్శనమిస్తారు.

అంతెందుకు అతని మంత్రిమండలి లో ఎక్కువగా జగన్ తన వయసు కు దగ్గరగా ఉన్న వారే. ఉన్న ముగ్గురు నలుగురు సీనియర్ నేతలంతా రాజశేఖర్ రెడ్ది హయాంలో అతబితో అత్యంత సన్నిహితంగా మెలిగిన వారే. అలాంటి వారే మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వంటివారు. వారిలో ఇద్దరికి రాజ్యసభ సభ్యులను కూడా జగన్ కల్పించాడు

ఇక ఇప్పుడు పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులు అసమ్మతి పెరిగిన కారణంగా జగన్ 2024 ఎన్నికల్లో వారికి టికెట్లు ఇచ్చేలా కనిపించడం లేదు. మొదటి నుండి పార్టీలో యువతకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్న జగన్ సీనియర్ రాజకీయ నాయకులు చాలామంది ఇతర పార్టీల నుండి ఇక్కడికి వచ్చిన వారే కాబట్టి వారిపై కూడా ఎక్కువగా ఆశలు పెట్టుకోవడం లేదునెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిడిపిలోకి వచ్చారు. తరువాత ఏపీలో జగన్ గాలి బలంగా వీయడంతో ఆనం కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ఇదేవిధంగా చాలామంది సీనియర్లు జగన్ గాలిలో గెలిచిన వారే. వారే ఇప్పుడు  జగన్ పై అసంతృప్తితో ఉంటూ బహిరంగంగా విషయాన్ని వెళ్లగక్కుతుండడం జగన్ కు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయిప్రస్తుతానికి సీనియర్ల హడావుడి వైసీపీ ప్రభుత్వంలో కనిపించినా, వచ్చే ఎన్నికలనాటికి వారి ప్రభావం కనిపించకుండా  చేయాలన్నదే జగన్ ప్లాన్ గా తెలుస్తోంది

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

జ‌గ‌న్ కోసం… జ‌గ‌న్ వెంటే… ఆ ఓట‌రే వైసీపీకీ ప్ల‌స్ అయ్యాడా…!

ఆ వైసీపీ ఫైర్ బ్రాండ్ పొలిటిక‌ల్ కెరీరే డేంజ‌ర్లో ప‌డిందా..?

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju