NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఇక రోడ్లపైకి కొత్త అత్యవసర సేవల వాహనాలు.. ! ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.!!

 

ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు సంబంధించిన 14 వాహనాలను, వాటితో పాటు అత్యవసర పోలీస్ సేవల కోసం మరో 36 వాహనాలను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి గురువారం వర్చువల్ కార్యక్రమం ద్వారా వీటిని సీఎం జగన్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 14 డిజాస్టర్ రెస్పాన్స్ వాహనాలను, 36 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వాహనాలను పోలీస్ శాఖకు అప్పగిస్తున్నట్లు చెప్పారు. దిశ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి త్వరలో పెద్ద ఎత్తున వాహనాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. త్వరలోనే వాటిని పోలీస్ శాఖకు అప్పగిస్తామని తెలిపారు.

అగ్నిమాపక శాఖలో సంవత్సరాల క్రితం ఇచ్చిన వాహనాలే కొనసాగుతుండటంతో వాటిలో కొన్నిరిపేర్లు వచ్చి సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాద సమాయాల్లో వేగంగా వెళ్లలేని పరిస్థితి ఉంటోంది. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో కొత్త వాహనాలు వచ్చాయి. ఎటువంటి విపత్తు జరిగినా అన్ని ఉపకరణాలు ఉండేలా..20 మంది ఎస్డీఆర్ఎఫ్ బృందం వెళ్లేలా విపత్తు నిర్వహణ, అత్యవసర సేవలకు చెందిన 14 వాహనాలు రూపుదిద్దుకున్నాయి. అత్యాధునిక వీడియో కెమెరాలతో సెంట్రల్ కమాండ్ రూమ్ కి ఇవి కనెక్ట్ కానున్నాయి. వీటి ద్వారా ప్రమాద ఘటన వద్ద క్షేత్రస్థాయి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి పోలీస్ శాఖ సత్వర నిర్ణయాలు తీసుకోనున్నది.

ఆరోగ్య సేవలకు నాలుగు నెలల క్రితమే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కొత్త 104, 108 అంబులెన్స్‌లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కొత్త అంబులెన్స్‌లు ఇప్పుడు వేగంగా క్షతగాత్రులను, ఇతర వైద్య సేవలు అవసరమైన వారిని వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లి సకాలంలో వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నాయి. అత్యవసర సేవలకు సంబంధించి వాహనాలను ఏర్పాటు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!