Chandrababu: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. చంద్రబాబుకు మద్యంతర బెయిల్ మంజూరు అయ్యింది. నాలుగు వారాల పాటు ఆయనకు మద్యంతర బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు. అనారోగ్య కారణాల రీత్యా చికిత్స నిమిత్తం మద్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ పూర్తి చేసిన హైకోర్టు ..ఇవేళ తీర్పు వెల్లడించింది. షరతులతో కూడిన బెయిల్ చంద్రబాబుకు న్యాయమూర్తి మంజూరు చేశారు.

రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నవంబర్ 10వ తేదీన హైకోర్టు విచారణ చేపట్టనుంది. స్కిల్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ కేసులో గత నెల 9వ తేదీన నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. మరుసటి రోజు ఏసీబీ కోర్టులో హజరుపర్చగా రిమాండ్ ఉత్తర్వుల నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. గత 52 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్నారు. హైకోర్టు మద్యంతర బెయిల్ మంజూరు కావడంతో చంద్రబాబు ఈ రోజు సాయంత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది.
ఇవి మద్యందర బెయిల్ షరతులు.. లక్ష రూపాయల పూచికత్తుతో ఇద్దరు ష్యూరిటీ. సొంత ఖర్చుతో ఎక్కడైనా వైద్య సౌకర్యం పొందవచ్చు. చికిత్స, ఆసుపత్రి వివరాలు జైల్ అధికారులకు తెలియజేయాలి. నవంబర్ 28వ తేదీన జైల్ లో సెరెండర్ కావాలి.
ఆరోగ్య కారణాలతో కండిషన్ బెయిల్ మంజూరు కావడం వల్ల చంద్రబాబు నేరుగా జనాల్లోకి వెళ్లే అవకాశం లేదు. నాలుగు వారాల పాటు తనకు నచ్చిన ఆసుపత్రిలో వైద్య సేవలు పొందవచ్చు చంద్రబాబు. రెగ్యులర్ బెయిల్ మంజూరు అయితేనే చంద్రబాబు మరల యధావిధిగా జనాల్లోకి వెళ్లే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం మద్యంతర బెయిల్ మాత్రమే మంజూరు కావడంతో చంద్రబాబుకు స్వల్ప ఊరట లభించింది.
TTDP: చంద్రబాబుకు బైబై చెప్పిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని