NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏలూరు ఎంపీ సీటు మ‌నం గెల‌వ‌లేమా.. టీడీపీలో కొత్త డౌట్లు.. !

ఎస్ ఇప్పుడు ఇదే చర్చ ఏలూరు జిల్లా పార్లమెంటు పరిధిలో ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులను టెన్షన్ పెడుతోంది. ఏలూరు పార్లమెంటు సీటు తెలుగుదేశం పార్టీకి బలమైన సీటు. పైగా జనసేన – బీజేపీ పొత్తు కూడా ఉండడంతో చాలా సింపుల్గా ఏలూరు పార్లమెంటు స్థానాన్ని తెలుగుదేశం గెలుచుకోవచ్చు. అయితే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఏలూరు పార్లమెంటు సీటులో తెలుగుదేశం గెలుస్తుందా ?అన్న సందేహాలు తెలుగుదేశం పార్టీ నాయకులు.. తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనే వినిపిస్తున్నాయి. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నూజివీడు స్థానం ముందు నుంచి పార్టీకి వీక్‌గా ఉంటుంది.

ఇక్కడ తెలుగుదేశం చివరిసారిగా 2009లో మాత్రమే గెలిచింది. 2014, 2019 ఎన్నికలలో కూడా పార్టీ ఓడిపోయింది. పైగా ఇప్పుడు కూడా నూజివీడు తెలుగుదేశం అభ్యర్థిగా వలస వచ్చిన వైసీపీ నేత మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పోటీ చేస్తున్నారు. అక్కడ ఆయన నాయకత్వాన్ని స్థానిక నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక పార్లమెంటు పరిధిలోని ఉంగుటూరు సీటును జనసేనకు ఇచ్చేశారు. సాక్షాత్తు ఇక్కడ నుంచి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గని వీరాంజనేయులు సీటు ఆశించినా.. ఆయనకు నిరాసే మిగిలింది.

ఇక పోలవరం సీటును ఎప్పుడు అయితే జనసేనకు ఇస్తున్నారని ప్రకటన వచ్చిందో.. ఆ సీటుపై టీడీపీ నేతలు గెలుస్తామన్న ఆశలు వదిలేసుకున్నారు. ఉంగుటూరు, పోలవరం సీట్లు జనసేనకు ఇవ్వగా.. కైకలూరు సీటును బీజేపీకి అంటున్నారు. అది కూడా కామినేని శ్రీనివాస్‌కు కాకుండా.. సోము వీర్రాజుకు సీటు ఇస్తే కైకలూరు కూడా బీజేపీ గెలిచే పరిస్థితి లేదంటున్నారు. ఇక నూజివీడులో ఎలాగూ పార్టీ వీక్‌గా ఉంది. ఇక పార్టీకి కాస్త కూస్తో ఆశలు కనిపిస్తున్న నియోజకవర్గాలు రెండు మాత్రమే. అందులో ఒకటి ఏలూరు. రెండు చింతలపూడి.

ఇక దెందులూరులో హోరాహోరి పోరు నెలకుంది. ఇక్కడ నుంచి పార్టీ బయటపడిన అతి స్వల్ప మెజార్టీ మాత్రమే వస్తుందని లెక్కలు వేసుకుంటున్నాయి. మరోవైపు వైసీపీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ అభ్యర్థి అయిన కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తున్నారు. సునీల్ తండ్రి మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు ఈ ప్రాంతంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ఈక్వేషన్లు చూస్తున్నా.. అటు కూటమి వేస్తున్న ఎత్తులు చూసినా.. ఏలూరు పార్లమెంటు సీటుపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగరటం అంతా సులువుగా కనిపించడం లేదు.

పార్టీకి పట్టున్్న‌ పార్లమెంటు స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఏకంగా మూడు సీట్లు పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి ఇచ్చేస్తే ఇంకా తెలుగుదేశం ఇక్కడ ఎలా బలం పుంజుకుంటుంది..? అని ఆ పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇక్కడ కచ్చితంగా టీడీపీనే పోటీ చేస్తుందా..? లేదా..? పార్లమెంట్ నుంచి బిజెపి అభ్యర్థి రేసులో ఉంటారా..? అన్నది కూడా ఎప్పటి వరకు తేలకపోవటం కూడా మైనస్ గా ఉంది.

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

ED Raids: మంత్రి పీఏ నివాసంలో రూ.20కోట్లకుపైగా నగదు స్వాధీనం

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?