NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు కేసుల్లో ఏ కోర్టుల్లో పరిస్థితి ఏమిటంటే..?

Chandrababu Arrest:  స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు సంబంధించి పిటిషన్లు ఇటు ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ఉన్నాయి. వాటి పరిస్థితి ఏమిటంటే.. సుప్రీం కోర్టులో చంద్రబాబు తరుపున క్వాష్ పిటిషన్ ను ఆయన న్యాయవాది సిద్ధార్ధ లూథ్రా మెన్షన్ చేశారు.

ACB Court and Supreme Court hearing today on Chandrababu's petitions
Chandrababu’s petitions

ఇది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యవహారమని.. అక్కడ ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ వద్ద న్యాయవాది లూథ్రా ప్రస్తావించారు. దీనిపై ఎన్ని రోజుల నుండి కస్టడీలో ఉన్నారని సీజేఐ ప్రశ్నించగా.. ఈ నెల 8న అరెస్టు చేశారని న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్ ను అత్యవసరం విచారించాలని కోరారు. దీంతో రేపు మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సిద్ధార్ధ లూథ్రాకు సీజేఐ సూచించారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేస్తూ ఆదేశాలు ఇవ్వడంతో ఆ ఉత్తర్వులను సావ్ చేస్తూ చంద్రబాబు రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

మరో పక్క ఏసీబీ కోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. బెయిల్ పిటిషన్ పై ఇరుపక్షాల వాదనలు వినిపించాయి. చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రమోద్ దూబే వాదనలు వినిపించగా, సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, వివేకానంద కోర్టుకు హజరైయ్యారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు వినాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరగా, ముందు కస్టడీ పొడిగింపు పై దాఖలైన పిటిషన్ పై వాదనలు వినాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు. రెండు రోజుల సీఐడీ విచారణలో చంద్రబాబు సహకరించలేదన్నారు.

ACB remand Chandrababu naidu,

అందుకే మరో మూడు రోజులు కస్టడీ పొడిగించాలనీ, కేసు ఇప్పుడు కీలక దశలో ఉందని కావున కస్టడీ పొడిగింపు పిటిషన్ పై తమ వాదనలు వినాలని సీఐడీ న్యాయవాదులు కోరారు. దీంతో మెమో దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. మెమో దాఖలునకు సమయం ఇవ్వాలని సీఐడీ తరుపు న్యాయవాదులు కోరారు. కస్టడీ పిటిషన్ పై వాదనలు పూర్తి అవ్వగానే బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపి విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మరో వైపు చంద్రబాబు కస్టడీ వద్దంటూ ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.

Children’s Story: రాజులు మారెనో.. గుర్రాలు ఎగిరెనో | Pillala Kathalu

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N