Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన నాటి నుండి కొన్ని రంగాలకు చెందిన వారిని పోటీదారులుగా తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సీరియల్స్ నటులు, టీవీ యాంకర్లు, యూట్యూబర్స్, ఇంకా సోషల్ మీడియాలో పలు ప్లాట్ ఫామ్ లలో రాణిస్తున్న వారికి.. గుర్తింపు కలిగిన వారిని షోలో తీసుకుంటూ వస్తున్నారు. అంతేకాదు సినిమా రంగంలో సీనియర్ నటులు కరాటే కళ్యాణి, హేమ, ఉమాదేవి, సుదీప, ప్రియా ఆంటీ వంటి వారు రాణించటం జరిగింది. అయితే ఎక్కువగా బిగ్ బాస్ షోలో ట్రోఫీ గెలిచిన వారి ట్రాక్ రికార్డు పరిశీలిస్తే.. సింగర్స్ హవా నడిచింది అని చెప్పవచ్చు.
తెలుగు బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ లో సింగర్ గీతామాధురి అద్భుతంగా గేమ్ ఆడింది. తర్వాత సీజన్ 3 లో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ విజేతగా నిలిచాడు. సీజన్ 4 లో నోయల్ పరవాలేదు. సీజన్ ఫైవ్ లో శ్రీరామచంద్ర టాప్ ఫైవ్ కెళ్ళాడు. సీజన్ సిక్స్ లో రేవంత్ రన్నర్ గా నిలిచాడు. ఇక ఇదే కోవలో సీజన్ సెవెన్ లో ఎంట్రీ ఇచ్చిన దామిని.. ఆటతీరు ఎంతో నిరాశపరిచింది. దీంతో మూడో వారంలోనే దామిని నీ ప్రేక్షకులు ఇంటికి పంపించేశారు. తెలుగు బిగ్ బాస్ హౌస్ లో సింగర్స్ హవా మొన్నటి దాకా నడిచింది.
కానీ సీజన్ సెవెన్ లో మాత్రం దామిని దెబ్బకి డమాలని కింద పడిపోయింది. బిగ్ బాస్ సీజన్ మొదలయ్యాక ఇంత తొందరగా ఏ సింగర్ కూడా ఎలిమినేట్ కాలేదు. మొదటిసారి దామిని ఎలిమినేట్ కావడం జరిగింది. దీనంతటికీ కారణం ఆమె డబల్ గేమ్ ఆడటం వల్లే అని ప్రేక్షకులు అంటున్నారు. జెన్యూన్ గా కాకుండా కేవలం కెమెరా కోసం కంటెంట్ కోసం ఆమె వ్యవహరించిన తీరు.. త్వరగా ఎలిమినేట్ చేసినట్లు అయిందని కామెంట్లు చేస్తున్నారు.
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!