NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ నాల్గవ జాబితా వచ్చేసింది  .. చిత్తూరు లోక్ సభ అభ్యర్ధిగా డిప్యూటి సీఎం నారాయణ స్వామి

YSRCP: వైసీపీ నాల్గవ జాబితా విడుదల చేసింది. ఒక పార్లమెంట్, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి నాల్గో జాబితా ను గురువారం రాత్రి వైసీపీ సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాకు విడుదల చేశారు. రీజనల్ కోఆర్డినేటర్ లు, ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

YSRCP

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో నిన్న  సీఎం జగన్మోహనరెడ్డి భేటీ జరిగినప్పటికీ ఒంగోలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాకు చెందిన పలు అసెంబ్లీ సిగ్మెంట్ల కు ఇన్ చార్జిలను ఖరారు చేయలేదు. నాల్గో జాబితాలో ప్రత్యేకత ఏమిటంటే ప్రకటించిన తొమ్మిది నియోజకవర్గాల్లో ఒక్క కనిగిరి మినహా మిగిలిన ఎనిమిది నియోజకవర్గాలు రిజర్వుడ్  స్థానాల్లోని ఇన్ చార్జిలను మార్పులు చేర్పులు చేశారు.

గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటి సీఎం నారాయణ స్వామిని చిత్తూరు లోక్ సభ ఇన్ చార్జిగా ప్రకటించిన పార్టీ ప్రస్తుతం చిత్తూరు ఎంపిగా ఉన్న ఎన్ రెడ్డెప్పను గంగాధర నెల్లూరు అసెంబ్లీ ఇన్ చార్జిగా నియమించారు. కొవ్వూరు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న హోంమంత్రి తానేటి వనిత ను తన సొంత నియోజకవర్గం గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పంపి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న తలారి వెంకట రావును కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు.

రీసెంట్ గా టీడీపీ నుండి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామి దాసును తిరువూరు అసెంబ్లీ ఇన్ చార్జిగా నియమించారు. మడకశిర సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి ని పక్కన పెట్టి ఆయన స్థానంలో ఈర లక్కప్పను ఇన్ చార్జిగా నియమించింది పార్టీ. శింగనమల సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి స్థానంలో ఎం వీరాంజనేయులును ఇన్ చార్జిగా నియమించారు.

నందికొట్కూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ ను అక్కడి వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నందున ఆయన స్థానంలో డాక్టర్ సుధీర్ ను ఇన్ చార్జిగా నియమించారు. అయితే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రతిపాదించిన లబ్బి వెంకట స్వామికి సీఎం జగన్ అవకాశం ఇవ్వకుండా కడప జిల్లాకు చెందిన వైద్యుడు దారా సుధీర్ ను నందికొట్కూరు ఇన్ చార్జిగా నియమించారు.

కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బూర మధుసూధన్ యాదవ్ ను పక్కన పెట్టి అదే సామాజికవర్గానికి చెందిన దాదాల నారాయణ యాదవ్ ను ఆయన స్థానంలో ఇన్ చార్జిగా నియమించారు.

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

Related posts

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju

Sunita Williams: సునీత విలియమ్స్ రోదసీ యాత్రకు బ్రేక్ .. కారణం ఏమిటంటే..?

sharma somaraju

Vladimir Putin: అణ్యాయుధ విన్యాసాలకు ఆదేశించిన పుతిన్

sharma somaraju

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella