Dasara Breaking News: ఒకసారి మనిషి గనక మద్యానికి బానిస అయితే ఇక తన శరీరం మీద, మైండ్ మీద పట్టుని, కంట్రోలు ని కోల్పోతాడని మరోసారి రుజువైంది. మద్యం మత్తు కారణం గా ఎన్నో ప్రమాదాలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. మద్యం ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతుండడం ఒక కారణం. తాజాగా చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి నోటిలో నాటు బాంబ్ పేలి మృతిచెందాడు. ఈ ప్రమాదం సోమవారం అర్థరాత్రి జరిగిందని తెలుస్తోంది. ఆ వ్యక్తిని వెను వెంటనే ఆసుపత్రికి తరలించైనా కూడా ప్రాణం దక్కలేదు. అప్పటికే ఆటను చనిపోయినట్లుగా ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ప్రమాదము వలన జరిగిన సంఘటన గా నమోదు చేశారు.

ఆ గ్రామ ప్రజల కథనం ప్రకారం , మృతుడు గడ్డంవారిపల్లికి చెందిన ఎం చిరంజీవిగా గుర్తించారు. పోలీసులు రంగం లోకి దిగి విచారణ చేస్తున్నారు. బంగారుపాళ్యం సీఐ నాగరాజురావు మాట్లాడుతూ మృతుడు తన జీవితంలో కష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అతని భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడం తో ఆమెతో గొడవ పడ్డాడు. తర్వాత ఆటను బాగా క్రుంగి పోయాడు. మద్యపానానికి బానిసైపోయాడు. చిరంజీవికి సోమవారం రాత్రి ఓ నాటు బాంబు దొరికింది.. దాని ఒత్తిని నోటితో కొరకడంతో ఆ నాటు బాంబు పేలింది. మొహం, చేయి నుజ్జు నుజ్జైంది.
ఈ ఘటనలో చిరంజీవి ఘటనా స్ధలంలోనే చనిపోయాడు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం తెలియచేయడం తో పోలీసులు సంఘటనా స్థలానికి చేరి, మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు చిరంజీవికి వివాహం అయింది. కొన్నాళ్లు దంపతుల జీవితం సాఫీగా సాగింది. తర్వాత దంపతుల మధ్య గొడవలు పెరిగి రోజూ గొడవపడడం మొదలైంది. ఈ కారణం గా చిరంజీవి మద్యానికి బానిసగా మారాడు. భార్యతో గొడవపడిన చిరంజీవి మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి నాటు బాంబు కొరికి ప్రాణాలు పోగొట్టుకున్నాడు.మద్యం తాగడం వలన ఆలోచన పోయి, ఒకరకమైన మత్తులో ఇటువంటి ప్రమాదాలకు గురి అవుతున్నారు. ఈ సంఘటన ప్రతీ వ్యక్తికీ ఒక కను విప్పు కావాలి