Eatela Rajendar: స్పీక‌ర్ ఫార్మాట్లో ఈట‌ల రాజీనామా చేయ‌నిది ఇందుకేనా?

Share

Eatela Rajendar: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌మ్మిన‌బంటు గా పేరొందిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఆయ‌న టీఆర్ఎస్ పార్టీ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏ పదవి ఇచ్చినా సంపూర్ణంగా న్యాయం చేశానని, తనను ఎమ్మెల్యేగా ఎలా తొలగించాలా అని ఆలోచన చేస్తున్నారని తెలిసిందన్నారు. వారు తొలగించేలోగా తానే వదులుకుంటానని ఈటల ప్రకటించారు. అయితే, ఎందుకు రాజీనామా చేయ‌లేద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

Read More: Eatela Rajendar: ఆ ఒక్క‌మాట‌తో లేచి… ఈట‌ల‌పై ఫైర‌వుతున్న క‌మ్యూనిస్టు పార్టీలు

జ‌రగాల్సింది ఇది…

విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించిన ఈట‌ల రాజేంద‌ర్ టీఆర్ఎస్ పార్టీ స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్నాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌క‌ట‌న ప్ర‌కారం ఈట‌ల రాజేంద‌ర్ శ‌నివారం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సింది. ముందుగా హైద‌రాబాద్ నాంపల్లిలోని అసెంబ్లీ ముందు ఉండే గన్‌పార్క్‌ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అనంత‌రం అసెంబ్లీ స్పీక‌ర్ పోచారం శ్రీ‌నివాస్‌ రెడ్డిని కలిసి రాజీనామా అందించనున్నారని అన‌ధికార స‌మాచారం సైతం వ‌చ్చింది. స్పీకర్ ఫార్మాట్‌లోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ లేఖ‌ను అందించ‌నున్నారని కూడా తెలియ‌జేశారు.

Read More: Eatela Rajendar: ఈట‌ల రాజీనామా ఎపిసోడ్ తో కాంగ్రెస్ లో క‌ల‌క‌లం…

ఎందుకు అలా జ‌రిగిపోయిందంటే…

అయితే, చివ‌రి నిమిష‌యంలో రాజీనామా విష‌యంలో ఈట‌ల రాజేంద‌ర్ త‌న నిర్ణ‌యం మార్చుకున్న‌ట్లు స‌మాచారం. స్పీక‌ర్ ఫార్మాట్లో రాజీనామా , స్పీక‌ర్ ను క‌లిసి లేఖ అంద‌జేయ‌డం వంటి ఏర్పాట్లు అన్నీ చేసుకున్న ఈట‌ల రాజేంద‌ర్ ఈ సంద‌ర్భంగా శ‌నివారం మంచి రోజు కాదు అని ఆగిపోయిన‌ట్లు తెలుస్తోంది. మంచి రోజు చూసుకొని ఆయ‌న ప‌ద‌విని వీడ‌నున్న‌ట్లు స‌మాచారం.


Share

Related posts

Mosquitos: ఇలా చేస్తే ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు..!!

bharani jella

భారతీ సమేత జగనే బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు ఇవ్వాలన్న బాబు!

Yandamuri

Yanamala ramakrishnudu: ఉద్యోగ క్యాలెండర్ అంకెల గారిడీ – యనమల

somaraju sharma