NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

GVMC Demolition: విశాఖ టీడీపీ నేత పల్లాకు జీవీఎంసీ అధికారుల షాక్..

GVMC Demolition:  విశాఖ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ కు గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ (జీవిఎంసీ) అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖ పాత గాజువాక సెంటర్ లో పల్లా శ్రీనివాస్ నిర్మిస్తున్న భహళ అంతస్తు భవన నిర్మాణం నిబంధనలకు వ్యతిరేకంగా ఉందని జీవిఎంసీ అధికారులు ఆదివారం తెల్లవారుజాము నుండి కూల్చివేత పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసర్ అక్కడికి చేరుకుని రాత్రి సమయంలో నిర్మాణాలు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా భవనాన్ని ఎలా కూల్చివేస్తారని మండిపడ్డారు. గత ఏడాది తీసుకున్న అనుమతుల ప్రకారమే తాను భవనాన్ని నిర్మిస్తున్నానని పల్లా శ్రీనివాస్ తెలియజేశారు. అయితే పల్లా శ్రీనివాస్ భవనం కూల్చివేస్తున్నట్లు తెలుసుకున్న స్థానికి టీడీపీ శ్రేణులు అక్కడకు చేరుకున్నారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు.

GVMC Demolition ex tdp mla palla srinivas building
GVMC Demolition ex tdp mla palla srinivas building

అయితే మున్సిపల్ నిబంధనలను ఉల్లంఘించి భవన నిర్మాణం చేసినట్లు జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. దీనిపై ముందుగానే నోటీసులు ఇచ్చామనీ, రోడ్డుకు సెట్ బ్యాక్ వదలలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు స్పందిస్తూ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలన గాలికి వదిలేసి సెలవుదినాల్లో విధ్వంసాలకు పాల్పడుతోందని ఆరోపించారు. జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష పూరితంగా టీడీపీ నేతల ఇళ్లు, భవనాలు కూల్చివేస్తుందని విమర్శించారు. పల్లా శ్రీనివాస్ భవనాన్ని జీవిఎంసీ అధికారులు కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించిన ఆయన కనీసం నోటీసులు ఇవ్వకుండా తెల్లవారుజామున భవనాన్ని కూల్చివేయడం దారుణమన్నారు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన నాటి నుండి ప్రజా వేదిక మొదలు ప్రతిపక్ష నేతల ఇళ్లు ఎన్ని కూల్చారో లెక్కలేదన్నారు. రోజురోజుకు వైసీపీ రాక్షస సంస్కృతి శృతి మించుతోందనీ, అధికారం శాశ్వతం కాదు తగిన మూల్యం చెల్లించకతప్పదు అని పేర్కొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!