NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే…

KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఆర్టీసీ సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చే విధంగా టీఎస్‌ఆర్టీసి కార్గో, పార్సిల్ సేవలు అతి తక్కువ సమయంలోనే వినియోగదారుల ఆదరణ చూరగొంటున్నాయి. ఇదే స‌మ‌యంలో టీఎస్‌ఆర్టీసీ కార్గో మరికొన్ని చర్యలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ సలహా మేరకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా కార్గో , పార్శిల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సరికొత్త వ్యూహాలతో కార్గో విభాగం కార్యాచరణ దిశగా అడుగులు వేస్తుండ‌గా తాజాగా ఏపీ ప్ర‌జ‌ల‌కు ఓ గుడ్ న్యూస్ వినిపించింది.

Read More: KCR: కేసీఆర్ నోటి వెంట ఆ మాట త‌ప్ప మ‌రోటి రావ‌ట్లేదుగా…

ఏపీ ప్ర‌జ‌ల‌కు తీపిక‌బురు ఏంటంటే…

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ కొనసాగుతున్న సేవలు మరింత త్వరితగతిన అందే విధంగా టి.ఎస్.ఆర్టీసీ తగు కార్యాచరణను అమలుపరుస్తోంది. వ్యాపార కేంద్రాలైన విజయవాడ , విశాఖపట్నం పట్టణాలకు నేరుగా నిత్యం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మీదుగా కార్గో సర్వీసులను నడుపుతోంది. 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో వాహనాలను పటాన్ చెరువు , మెహిదీపట్నం , లక్షకాపూల్ , సి.బి.ఎస్ నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ లో బయలుదేరిన కార్గో కనెక్టెడ్ పాయింట్లు కోదాడ , సూర్యాపేట , విజయవాడ , రాజమండ్రి , అన్నవరం , తుని మీదుగా విశాఖపట్నం చేరుకోనుంది . అలాగే , ఏపీ నుంచి కూడా వినియోగదారులు కార్గోను ఉపయోగించుకునే విధంగా టారిఫ్ రేట్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. ప్రైవేట్ వాటితో పోలిస్తే టి.ఎస్.ఆర్టీసీ కార్గో ఛార్జీలు సమంజసంగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు.

Read More: KCR: కేసీఆర్‌పై ష‌ర్మిల రాజ‌కీయం మామూలుగా లేదుగా….

వినియోగదారుల డిమాండ్ మేరకు కార్గో సేవలు
ఇల్లు మారుస్తున్నప్పుడు , గృహ నిర్మాణం , పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు , పర్నీచర్‌తో పాటు ఇతరత్రా వస్తు సామాగ్రీలను తరలించేందుకు ఈ ప్రత్యేక కార్గో అందుబాటులో ఉంచారు. దూరం, వస్తు పరిమాణం బట్టి నిర్దిష్టంగా ఒకే రకమైన ధరలు నిర్ణయించారు. సరుకులను అత్యంత వేగంగా చేరవేసేందుకు గానూ ఈ సేవలు వినియోగదారులకు ఎంతో ఉపకరిస్తాయి. రాష్ట్ర , రాష్ట్రతర ప్రాంతాలకు సరకు రవాణాకు సంబంధించిన బుకింగ్ , డెలివరీ సదుపాయాలతో పాటు వేగంగా , భద్రంగా సేవలు కొనసాగుతుండటంతో ఆదరణ చూరగొంటోంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N