Jr NTR Banners: హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు తీవ్ర కలకలాన్ని రేపిన సంగతి తెలిసిందే. దీనిపై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. వెయ్యి మంది బాల కృష్ణలు, చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ను ఏమి చేయలేరని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించినంత మాత్రన ఏమీ చేయలేరని అన్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన వారు ఎన్టీఆర్ వర్ధంతి చేస్తారా అంటూ మండిపడ్డారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాళ్లది నీఛాతినీచమైన బుద్ది అంటూ దుయ్యబట్టారు.
ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో మరో సారి విభేదాలు బయటపడిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఘాట్ వద్ద బాలకృష్ణ అనుచరులు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించారు. బాలయ్య ఆదేసాల మేరకే ఫ్లెక్సీలు తొలగించినట్లుగా ప్రచారం జరుగుతోంది. బాలకృష్ణ వచ్చి వెళ్లిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి.
TDP Vs Kodali: పోటా పోటీ కార్యక్రమాలతో గుడివాడలో హైటెన్ష్