Actress: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ షో హిట్ అయ్యేందుకు లేదా తమ కామెడీతో ప్రేక్షకులని నవ్వించేందుకు డబల్ మీనింగ్ డైలాగులు వాడుతూ రెచ్చిపోతున్నారు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తున్నారు కూడా. ఇక దీంతో నెట్టింట జనాలు అసభ్యకర చేష్టలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక ఇటువంటి షోలలో జబర్దస్త్ కూడా ఒకటి. ఈ షో ద్వారా ఎంతోమంది పాపులారిటీని సంపాదించుకున్నారు.
ఇక ఒకానొక సమయంలో ఎంతో పద్ధతిగా నడిచే ఈ షో ప్రస్తుత కాలంలో డబల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోతుంది. ఈ క్రమంలోనే.. తాజాగా వర్ష, ఇమాన్యుయల్ బూతు డైలాగులు చెబుతూ ఓ స్క్రిప్ట్ చేశారు. ఈ స్క్రిప్ట్ లో ఇమాన్యుయల్.. వర్షాను తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు. ” అరేయ్ ఈమె నీ ఫస్ట్ లవ్ వర్ష రా ” అని ఇమాన్యుయల్ తన స్నేహితుడికి పరిచయం చేస్తాడు. అలాగే మీరిద్దరూ స్కూల్లో కలిసి చదువుకున్నారు అని కూడా అంటాడు.
అప్పుడు ఇమాన్యుయల్ స్నేహితుడు.. నేను పిచ్చోడిని అయిపోయా. నువ్వు కూడా పిచ్చి దానివి అయిపోయావు ఏంటీ? అని అతడు అడుగుతాడు. నాకు ఒంటి మీద డ్రెస్ లేదు. నువ్వు కూడా బట్టలు విప్పేసి వచ్చావు ఏంటి వర్ష అని అడుగుతాడు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా పగలబడి నవ్వుతారు. అనంతరం మనమిద్దరం అప్పట్లో తరగతి గదిలో ఒంటరిగా తలుపులు మూసేసి ఉన్నాం కదా? అని అంటాడు ఇమాన్యుయల్ ఫ్రెండ్.
ఇమాన్యుయల్ తలుపులు మూసేసి ఏం చేశావు రా అని అడుగుతాడు. ఏమో నాకు కూడా గుర్తు లేదు అని తన ఫ్రెండ్ అంటాడు. ఇక ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఈ ప్రోమో ని చూసిన ప్రేక్షకులు..ష మరీ ఇంతలా దిగజారి పోయారేంటి. కామెడీ అంటే కామెడీ లాగానే ఉండాలి. అంతేకానీ డబల్ మీనింగ్ డైలాగులతో రెచ్చిపోకూడదు. ఇప్పుడే ఇలా ఉన్నారంటే రానున్న కాలంలో ఇంకా మిమ్మల్ని ఆపడం కష్టం ” అంటూ ఫుల్ గా తిడుతున్నారు.