NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమ్మ, అత్త, ఒక అన్న, ఇద్దరు చెల్లెళ్లు.. వైఎస్ కుటుంబ గొడ‌వ‌ల్లో కొత్త ట్విస్ట్ ఇది..!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే అందరికీ ఒక రకమైన గౌరవం. వైఎస్ బతికుండగా ఆయన తమ్ముడు వివేకానందరెడ్డి, కుమారుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే రాజకీయాల్లో కనిపించారు. వైఎస్ మరణం తర్వాత అక్రమాస్తుల కేసులో జగన్ జైలుకు వెళ్లిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారి కుటుంబం రోడ్డు మీదికి వచ్చింది. విజయమ్మ, షర్మిల, భారతి అందరూ రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలిపారు. ఆ తర్వాత జగన్ కు మద్దతుగా షర్మిల పాదయాత్రలు చేసింది. తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో విజయమ్మతో కలిసి షర్మిల ఆంధ్రా, తెలంగాణలలో పర్యటించింది.

2019లో వైఎస్ జగన్ ఆంధ్రాలో అధికారంలోకి వచ్చిన తర్వాత అనూహ్యంగా షర్మిల దూరమయింది. జగన్ దూరం పెట్టాడా ? షర్మిల దూరం అయ్యిందా ? ఆస్తుల పంచాయతీనా ? ఏంటో మాత్రం ఎవరికీ తెలియదు. ఎన్నడూ ఆ విషయంలో షర్మిల క్లారిటీ ఇవ్వలేదు. జగన్ తో పొసగక తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసింది. ఆఖరు నిమిషంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా చేతులెత్తేసి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిని తీసుకుని ఆంధ్రా రాజకీయాల్లోకి ఎంటరైంది.

వైఎస్ మరణం తర్వాత ఆ కుటుంబ కష్టాలకు కారణం కాంగ్రెస్ పార్టీ అని ప్రతి ఒక్కరికీ తెలుసు. అటువంటిది ఏకంగా అదే పార్టీలో షర్మిల చేరిపోవడం వైఎస్ అభిమానులకు రుచించడం లేదు. అయితే ఇదే సమయంలో వైఎస్ విజయమ్మ కూతురు, కొడుకు మధ్యలో నలిగిపోతూ ఇద్దరికీ ఆశీర్వాదాలు ఇచ్చి ఎన్నికల ప్రచారానికి పంపింది. జగన్, వైఎస్ అవినాష్ రెడ్డిల మీద షర్మిల, వివేకా కూతురు సునీత ఆరోపణలపై మేనత్త విమలమ్మ స్పందిస్తూ అనవసరంగా కుటుంబ పరువును బజారుకు ఈడుస్తున్నారని, ఇకనైనా నోరు మూసుకుని ఉండాలని సూచించింది. దానికి స్పందించిన షర్మిల విమలమ్మ కుమారుడికి జగన్ పనులు ఇవ్వడంతో ఆర్థికంగా బలపడ్డారని, అందుకే వైఎస్ వివేకా మేలును మరిచి జగన్ ను సమర్దిస్తున్నదని వెల్లడించింది.

ఈ పరిస్థితులలో కూతురు, కొడుకు ఇద్దరిలో ఎవరో ఒకరి వైపు ఉండలేక వైఎస్ విజయమ్మ అమెరికాలోని మనవడి వద్దకు వెళ్లిపోయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందరూ గౌరవంగా చూసే వైఎస్ కుటుంబం నుండి షర్మిల ఇలా విభేధిస్తూ, ఆరోపణలు చేస్తూ రోడ్డు మీదకు రావడం చాలా మంది జీర్ణించుకోలేక పోతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో వేచిచూడాలి.

Related posts

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!