Om Bheem Bush OTT Response: సినిమా జోనర్లలో పూర్తి హర్రర్ టచ్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ప్రస్తుత కాలంలో ఎక్కువ శాతం ఆదరిస్తున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో వచ్చిన అనేక మూవీస్ ప్రస్తుతం హిట్గా నిలిచాయి. సరైన టేకింగ్ తో తెరకెక్కిస్తే హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీలు మంచి హిట్ అవుతాయి. అలా పూర్తి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన సినిమాగా పేరు సంపాదించుకున్న మూవీ ” ఓం భీమ్ బుష్ “. బ్రోచెవారెవరురా సినిమాతో సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు సంపాదించుకున్న శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీలో విరీ కామెడీ టైమింగ్ ఎలా వర్కౌట్ అయిందో తెలిసిందే. ఇటీవలే ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన మూవీ ఓం భీమ్ బుష్.
ఈ ముగ్గురు కలిసి మరోసారి కామెడీతో మ్యాజిక్ చేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. దీనికి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఓం బీమ్ బుష్ మూవీని దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి తెరకెక్కించాడు. ఈయన గతంలో హుషార్, రౌడీ బాయ్స్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఇక ముందు నుంచి ట్రైలర్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో వచ్చి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ మార్చి 22న థియేటర్లలో విడుదలై మంచి టాక్ అందుకుంది. అదేవిధంగా కలెక్షన్స్ పరంగా కూడా ఇరగదీసింది అని చెప్పుకోవచ్చు. అలాంటి సూపర్ హిట్ మూవీ తాజాగా ఓటిటి ప్లాట్ఫారం లోకి వచ్చింది.
ప్రముఖ ప్లాట్ఫారం అయిన అమెజాన్ ప్రైమ్ లో ఏప్రియల్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది ఈ మూవీ. ముందుగా ప్రకటించినట్లు గానే కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది ఈ సినిమా. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటీలో దూసుకుపోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి లో ట్రెండింగ్ లిస్టులో రెండవ స్థానం దక్కించుకుంది ఈ మూవీ. అమెజాన్ ప్రైమ్ ఓటిటి టాప్ 2 ట్రెండింగ్ తో దూసుకెళ్తూ సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. విడుదలైన తొలి రోజునే ఇలా ట్రెండింగ్లో దూసుకుపోవడంతో ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.
థియేటర్లలో ఆదరించినట్లుగానే ఈ మూవీను ఓటీటీలో సైతం ఆడియన్స్ బీభత్సంగా ఆదరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ను వి. సెల్యులాయిడ్ బ్యానర్ పై సునీల్ బలుసు కలిసి నిర్మించారు. యు వి క్రియేషన్స్ ఈ మూవీని సమర్పించింది. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంటూ థియేటర్లలోకి వచ్చి మంచి విజయాలను సాధించారు శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. కాన్సెప్ట్ పరంగా బాగుండడంతో పాటు ఈ సినిమాని అద్భుతంగా డైరెక్ట్ చేయడంతో ఈ మూవీ భారీ సక్సెస్ గా నిలిచింది. ఇక రానున్న రోజుల్లో కూడా శ్రీ విష్ణు మరియు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఇంకెన్ని మ్యాజిక్ చేస్తారో చూడాలి మరి.