Jaram OTT Release: బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయీ నటించిన సర్వైవల్ థ్రిల్లర్ మూవీ ” జోరమ్ “. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 8న విడుదలైంది. ఇక ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయిన ఐదు నెలలకు ఓటీటీలోకి ఫ్రీగా అందుబాటులోకి వస్తుంది. ఇన్నాళ్లు ప్రైమ్ వీడియో లోనే ఉన్న రెంట్ విధానంలో మాత్రమే చూసే అవకాశం కల్పించారు. నిజానికి ఈ మూవీ ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో ఉండగానే యూట్యూబ్లో ఫ్రీగా అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఓటిటి కూడా ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తుంది. దేవశిష్ మకీజా డైరెక్ట్ చేసిన ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో విమర్శికుల నుంచి ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఎన్నో అవార్డులు సైతం అందుకుంది. ఈ మూవీ ఫ్రీగా ప్రైమ్ వీడియోలోకి వచ్చినట్లు శుక్రవారం అనగా ఏప్రిల్ 12న సోషల్ మీడియా ద్వారా మనోజ్ అనౌన్స్ చేశాడు.
సర్వైవల్ కోసం సాగే చేజ్ ప్రైమ్ వీడియోలో కొనసాగనుంది అనే క్యాప్షన్ తో జోరమ్ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని అతడు వెల్లడించాడు. అతనిని చంపాలని చూస్తున్న వారి నుంచి ఆ వ్యక్తి తన బిడ్డతో కలిసి పోరాడుతాడు. జార్ఖండ్ నుంచి ముంబై వచ్చి భవన నిర్మాణ పనులు చేసుకునే దాస్రు కర్కెట్టా అలియాజ్ బాలా (మనోజ్ బాబ్పేయీ) భార్య హత్యకు గురవుతుంది. దాస్రు, అతడి మూడు నెలల కూతురు జోరమ్ ప్రాణాలకు కూడా ముప్పు ఏర్పడుతుంది. దీంతో తమను మట్టుబెట్టాలని ప్రయత్నించే శక్తివంతమైన మనుషులు, వ్యవస్థ నుంచి దాస్రు తప్పించుకునేందుకు చాలా కష్టాలను ఎదుర్కొంటాడు. అతడికి హింసాత్మక గతం కూడా ఉంటుంది.
చంపాలనుకునే వారి నుంచి తనను, బిడ్డను ఎలా కాపాడుకున్నాడు.. ఈ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు అనే కథాంశం చుట్టూ ఈ మూవీ రూపొందింది. ఈ మూవీలో మనోజ్ పాయీతో పాటు జిషాన్ అయుబ్,స్మితా నటించారు. ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 8న థియేటర్లలోకి వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఇక ఇదే సమయంలో యానిమల్ వంటి సినిమాలు రిలీజ్ అవ్వడంతో వసూళ్లు కూడా పెద్దగా రాలేదు. ఈ మూవీ 2022లో రిటెర్డామ్ లో ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్ లో ప్రదర్శనమైంది. 70వ సిడ్ని ఫిలిమ్స్ ఫెస్టివల్, డర్బన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్, 28వ బుసాన్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ ఫెస్టివల్, 59వ చికాగో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనమైంది.
ఇక ప్రస్తుతం ఈ మూవీ ఓటీడీలో సందడి చేయనుంది. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన ఈ మూవీ ఓటిటిలో ఎటువంటి రెస్పాన్స్ తప్పించుకుంటుందో చూడాలి. ప్రస్తుత కాలంలో థియేటర్లలో బోల్తా పడ్డ సినిమాలు సైతం ఓటీటీలలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు నిలిచాయి. ఆ విధంగానే ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడినప్పటికీ ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటే ఈ సినిమా ఫ్లాప్ లిస్ట్ నుంచి హిట్ లిస్టు కి షిఫ్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.