NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో ముగిసిన అవినాష్ రెడ్డి విచారణ .. సీబీఐ దర్యాప్తుపై కీలక వ్యాఖ్యలు చేసిన అవినాష్ రెడ్డి

YS Viveka Murder Case:  మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ అధికారులు దాదాపు నాలుగున్నర గంటల పాటు అవినాష్ రెడ్డిని విచారించారు. విచారణ అనంతరం అవినాష్ రెడ్డి మీడియా ముందు కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య విషయంలో తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని తెలిపారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానన్నారు. వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. తనకు తెలిసిన అన్ని నిజాలతో ఒక వినతి పత్రాన్ని కూడా విచారణ అధికారికి ఇచ్చినట్లు చెప్పారు అవినాష్ రెడ్డి. ప్రస్తుత విచారణ పై ఎవరికైనా సందేహాలు వస్తాయన్నారు.

YS Avinash Reddy

 

తాను ఇచ్చిన వివరాలపైనా కూలంకుషంగా విచారణ జరపాలని కోరుతున్నానన్నారు అవినాష్ రెడ్డి. వాళ్లు ఆరోపిస్తున్నట్లు గూగుల్ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భవిష్యత్తులో కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఏడాది క్రితం టీడీపీ వాళ్లు చేసిన విమర్శలు ఇప్పుడు సీబీఐ వాళ్లు వేసిన కౌంటర్ లో ఉన్నాయని అందుకే అనుమానించాల్సి వస్తుందన్నారు. విచారణ తీరు పట్ల ఎవరికైనా సందేహాలు కలుగుతున్నాయన్నారు. ఈ విచారణ ఏకపక్షంగా జరుగుతోంది. వాస్తవాలకు అనుగుణంగా జరగడం లేదు. పర్సన్ టార్గెట్ గా జరుగుతుంది అనే సందేహాలు ఎవరికైనా లేవనెత్తుతాయన్నారు. వివేకా చనిపోయిన రోజున మార్చురీ వద్ద ఏమి మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నాననీ, అదే వాస్తవమని అన్నారు.

YS Vivekananda Reddy Murder Case

 

విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను మీడియాలో ఇవ్వాలని, మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఇంతకు ముందు విచారణలో మరో సారి రావాల్సి ఉంటుందని చెప్పారు గానీ ఈ సారి విచారణ సందర్భంలో మరో సారి విచారణకు రావాలని సీబీఐ అధికారులు చెప్పలేదని అవినాష్ రెడ్డి తెలిపారు.

వైఎస్ వివేకా హత్య కేసుపై సజ్జల సంచలన కామెంట్స్ .. జగన్ పై చంద్రబాబు కుట్రలు అంటూ..

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!