Vijayasai Reddy: ఏపీలో ఇప్పుడే ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీల్లోనూ పలు నియోజకవర్గాల్లో టికెట్ ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అనిల్ కుమార్, ఆయన బాబాయ్ రూప్ కుమార్ మధ్య విభేదాల కారణంగా వర్గ విభేదాలు నెలకొన్నాయి. బాబాయ్, అబ్బాయ్ మధ్య రాజీ చేసేందుకు సీఎం జగన్ ప్రయత్నించినా వారు ఇద్దరు కలిసి పని చేసే పరిస్థితి కనబడలేదు. ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా అనిల్ కుమార్ యాదవ్ అసంతృప్తిగా ఉన్నట్లుగా టాక్ నడుస్తొంది. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి కీలక ప్రకటన చేశారు.

నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని విజయసాయి రెడ్డి ప్రకటించారు. టీడీపీ ఇప్పటికే నెల్లూరు టౌన్ నియోజకవర్గ ఇన్ చార్జిగా మాజీ మంత్రి నారాయణను నియమించింది. గత ఎన్నికల్లోనూ నారాయణ, అనిల్ కుమార్ మధ్యనే పోటీ జరిగింది. అనిల్ కుమార్ యాదవ్ వరుసగా రెండు సార్లు వైసీపీ అభ్యర్ధిగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి కేవలం 90 ఓట్ల తేడాతో పీఆర్పీ అభ్యర్ధి చేతిలో కేవలం 90 ఓట్ల తేడాతో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత 2012లో అనిల్ కుమార్ వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీలో చేరారు. 2014 లో సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై 19వేల పైచిలుకు మెజార్టీతో అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుండి గెలుపొందారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి, నాటి మంత్రి నారాయణపై సుమారు 3వేల ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్ గెలిచారు.
ఇక నెల్లూరు వైసీపీ పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న ఆదాల ప్రభాకరరెడ్డి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారన్న అభియోగంపై ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించిన నేపథ్యంలో ఎంపీ ఆదాల ప్రభాకరరెడ్డికి రూరల్ నియోజకవర్గ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించింది పార్టీ. రాబోయే నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుండి ఆదాల ప్రభాకరరెడ్డి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా ఉన్నవేమిరెడ్డి ప్రభాకరరెడ్డి నెల్లూరు లోక్ సభ స్థానం నుండి పోటీ చేస్తారని విజయసాయి రెడ్డి తెలిపారు. దీంతో నెల్లూరు టౌన్ అసెంబ్లీ, లోక్ సభ స్థానాలకు సంబంధించి క్లారిటీ వచ్చినట్లు అయ్యింది.
Chandrababu Arrest: చంద్రబాబుకు తొలి ఊరట తీర్పు .. ఆ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు