Nandamuri Family: టీడీపీలో సెన్సేషన్ ఇదే..!? జూనియర్ ఎన్టీఆర్ ని ఈజీగా తీసిపారేసిన చేసిన బాలయ్య..!!

Balakrishna Comments: Viral in TDP Plus or Minus
Share

Nandamuri Family: తెలుగు దేశం పార్టీకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏకైక ఆశ జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. చంద్రబాబు నాయకత్వంపై బోరు కొట్టి, నమ్మకం లేక..! లోకేష్ నాయకత్వంపై ఆశలు సన్నగిల్లి..! బాలకృష్ణ నాయకత్వంపై కామిడీ క్రియేట్ అయి..! వేరే దిక్కులేక.. నావను నడిపించే నాయకుడు ఎవరా? అని ఎదురుచూస్తున్న తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టిఆర్ మాత్రమే ఓ పెద్ద ఆశ దీపంగా కనిపిస్తున్నారు. గడచిన కొద్ది నెలల నుండి టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ రాక కోసం దిగువ స్థాయి నుండి ఉన్నత స్థాయి వరకూ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ యాదృశ్చికంగా అన్నారో, ఉద్దేశపూర్వకంగా అన్నారో, మనసులో ఏదో పెట్టుకుని అన్నారో తెలియదు కానీ, ఈ రోజు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మాత్రం తెలుగుదేశం పార్టీలో మాత్రం పెద్ద సంచలనంగా మారబోతున్నాయి.

Nandamuri Family: Balakrishna sensational comments
Nandamuri Family: Balakrishna sensational comments

Read More: Jagan Delhi Tour: ఈసారి ప్లాన్ తో ఫిక్స్.. ఢిల్లీకి సీఎం జగన్ – అజెండా ఇదే..!?

బాలయ్య ఎమన్నారు ఉన్నది ఉన్నట్టు చూద్దాం..

జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో యాక్టివ్ రోల్ తీసుకోవాలని చాలా మంది ఈ మధ్య కాలంలో కోరుతున్నారు కదా దానిపై మీ కామెంట్ ఏమటి, జూనియర్ వస్తే ఎలా ఉంటుంది అని ఓ యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ ఈ విధంగా వ్యాఖ్యానించారు. “ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఇష్టాఇష్టాలు వారివి. వాళ్ల ఇష్టాన్ని బట్టి వాళ్లు ఎంచుకుంటారు. వస్తాడా? రాడా? అనేది ఐమాన్ నాట్ బాదర్డ్, ప్లస్ అయి మైనస్ అవ్వచ్చు. ఎన్ టీ రామారావు గారు అయ్యారు కదా, అని సినిమాల్లో ఉన్నాం కదా, అంటే.. నేను ఉన్నాను, నా గురించి అందరికీ తెలుసు. ఐయామ్ ట్రాన్పిరెంట్ పర్సన్, తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఒక ట్రాన్స్ పిరెంట్ నుండి పుట్టింది. ఒక ఆవేశం నుండి పుట్టింది. వేరే రకంగా కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వెరీ ట్రాన్స్ పిరెంట్, అలాంటి వారికే పార్టీలో సముచితమైన స్థానం ఉంటుంది. అదే నేను పోయినసారి మహానాడులో కూడా యూత్ ని మనం నెగ్లట్ చేస్తున్నాం, యూత్ పై దృష్టి పెట్టాలి లేకుంటే నాకు అప్పగించండి నేను తీసుకుంటా యూత్ బాధ్యత” అని చెప్పానన్నారు.

Nandamuri Family: Balakrishna sensational comments
Nandamuri Family: Balakrishna sensational comments

Nandamuri Family: దీనిపై చంద్రబాబు గానీ, ఎన్టీఆర్ గానీ స్పందిస్తారా..?

జూనియర్ ఎన్టీఆర్ ను మళ్లీ యాక్టివ్ చేయాలని చంద్రబాబు వర్గంలోనూ, ఆ కమ్మ సామాజికవర్గంలో కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. జగన్ ను ఎదుర్కోవాలంటే, దూకుడుగా వెళుతున్న వైసీపీకి అడ్డుకట్ట వేయాలంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి చరిష్మా ఉన్న వాగ్ధాటి ఉన్న నాయకుడు తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేస్తే ఎంతో కొంత ఊపు వస్తుందని భావిస్తున్నారు. అంతగా నమ్మకం పెట్టుకున్న ఎన్టీఆర్ పైన బాలకృష్ణ ఇంత సిల్లీగా, చాలా ఈజీగా తీసిపారేయడం పట్ల టీడీపీ పెద్దలు ఎలా స్పందిస్తారనేది సందేహంగా మారింది. బాలకృష్ణ ఒక వేళ ఈ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసి ఉంటే మాత్రం బాలకృష్ణ నుండి వివరణ తీసుకుంటారు. లేదు తెలుగుదేశం పార్టీనే చంద్రబాబే బాలకృష్ణ చేత  వ్యాఖ్యలు చేయిస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చంద్రబాబు ద్వారా ఒక సంకేతం వెళ్లినట్లే. జూనియర్ ఎన్టీఆర్ రారు, మీరు పని మీరు చేసుకోండి, ఎన్టీఆర్ కు వచ్చే ఉద్దేశం లేదు. ఎన్టీఆర్ అవసరం లేదు అని పరోక్ష సంకేతాలు క్యాడర్ కు ఇస్తున్నట్టే. సో..  ఈ వివాదం ఎంత వరకు వెళుతుంది అనేది వేచి చూద్దాం.

 


Share

Related posts

నువ్వు చూసుకో అన్నా! సాయిరెడ్డి భుజం మీద జగన్ ‘డేంజరస్ ‘భాధ్యత !!

Yandamuri

జనతా కర్ఫ్యూ కారణంగా కిక్కిరిసిన సెకుంద్రాబాద్ రైల్వే స్టేషన్

Siva Prasad

మాజీ సీఎంపై లోకాయుక్త లో కేసు నమోదైతే అది చిన్న వార్తా? ఎవరిపైన? ఏమిటది?

Yandamuri