Jagan Delhi Tour: ఈసారి ప్లాన్ తో ఫిక్స్.. ఢిల్లీకి సీఎం జగన్ – అజెండా ఇదే..!?

Jagan Delhi Tour: Internal Reasons
Share

Jagan Delhi Tour: సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఊగిసలాట చుట్టూ తిరుగుతుంది. వెళ్తారా..? లేదా..? అపాయింట్మెంట్ ఖరారైందా..!? లేదా అనే సందేహాల మధ్య నాలుగు రోజుల నుండి నలుగుతుంది. గత శనివారమే వెళ్తారని టాక్ వచ్చినప్పటికి.. ఢిల్లీలో పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వలేదని, తర్వాత రమ్మన్నారని ప్రచారం జరిగింది. అందులో వాస్తవం ఎంత అనేది స్పష్టత రాకమునుపే మళ్ళి రేపు ఢిల్లీ వెళ్తారని ఒక ప్రచారం జరుగుతుంది. ఈసారి మాత్రం పుకారు కాదు. దాదాపు ఖరారైనట్టే. రేపు మధ్యాహ్నానికి ఢిల్లీ చేరుకొని.. రేపు సాయంత్రానికి కేంద్ర మంత్రులు పలువురితో భేటీ అయ్యి.., రేపు రాత్రికి అమిత్ షాని కలవనున్నారని అంటున్నారు. ఈ సారి మాత్రం ఒక స్పష్టమైన అజెండాతోనే అపాయింట్మెంట్ ఖరారైనట్టు తెలుస్తుంది.

Jagan Delhi Tour:  Internal Reasons
Jagan Delhi Tour: Internal Reasons

Jagan Delhi Tour:  టార్గెట్ రఘురామా.. సీబీఐ..!?

ఓ వైపు రఘురామకృష్ణంరాజు కేసు సుప్రీమ్ లో విచారణ దశలో ఉండడం.. సీబీఐ విచారణకు ఇవ్వాలా..? వద్దా అనే పిటిషన్ పై కేంద్రమే అఫడవిట్ దాఖలు చేయాల్సిన తరుణంలో జగన్ ఢిల్లీ వెళ్లనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు పూర్వాపరాలతో పత్తో… అమూల్ ప్రాజెక్టుకి రఘురామ అడ్డు తగులుతుండడం కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంది. ఈ వ్యవహారాలన్నిటిపై ఒక స్పష్టమైన వైఖరితో కేంద్రంతో మాట్లాడడానికి జగన్ ఢిల్లీ వెళ్లనున్నట్టు చెప్పుకోవచ్చు.

* జగన్ బెయిల్ రద్దుపై సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ పెండింగ్ లో ఉంది. ఇది ఏపీలో రెండు నెలల నుండి చర్చనీయాంశంగా ఉంది. దీనిపై త్వరగా తేల్చాలి. లేకపోతే సీఎం జగన్ మానసికంగా కొంత ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది.

Jagan Delhi Tour:  Internal Reasons
Jagan Delhi Tour: Internal Reasons

* రెబల్ ఎంపీ RRR కి బీజేపీ పెద్దల సపోర్ట్ ఉన్నట్టు కొన్ని వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీజేపీ అండ చూసుకునే రఘురామా ఇలా పోరాడుతున్నారని సోషల్ మీడియాలో కూడా ప్రచారంలో ఉంది. ఇదే క్రమంలో గుజరాత్ కి చెందిన అమూల్ ని ఏపీలో ఎదగనీయడం లేదు. బీజేపీ సిఫార్సుతో.. బీజేపీ పెద్దలకు లింకులున్న అమూల్ ని ఏపీలో ఎదగనీయని.. రఘురామకి బీజేపీ సపోర్ట్ ఉంటె ఎలా సమర్ధించగలరు..!? వెంటనే రఘురామా విషయంలో బీజేపీ వైఖరి తేల్చాల్సి ఉంది. అందుకే సీఎం జగన్ ఈ విషయాన్నీ నేరుగా అమిత్ షా వద్దనే మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు.
* వీటితో పాటూ సుప్రీం లో విచారణలో ఉన్న కేసులు.., ఏపీలో బీజేపీ ఆరోపణలు.. వాక్సిన్ అంశంలో కేంద్రానికి వ్యతిరేకంగా జగన్ ముందడుగు .. ఇలా భిన్న అంశాలపై అంతర్గతంగా స్పష్టత ఇచ్చుకోవాల్సి ఉంది. అందుకే ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది..
* ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత కూడా ఏ విషయమూ స్పష్టత ఉండదు. వైసిపి వర్గం మీడియా “సీఎం జగన్ ఢిల్లీకి నిధుల కోసం వెళ్లారు. ప్రత్యేక హోదా కోసం వెళ్లారు.. కేంద్రానికి నిధులు అడిగారు.. అంటూ రాసుకొస్తారు.. టీడీపీ అనుకూల మీడియాలో జగన్ ని అమిత్ షా క్లాస్ పీకారు అంటూ రాసుకొస్తారు.. సో.. సీఎం ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అక్కడ గడిపిన సమయం.. అపాయింట్మెంట్ ఇచ్చిన సమయం.. చూసుకుని ఆ రెండు రోజుల్లో జరిగే పరిణామాల ఆధారంగా నిజాలు గ్రహించవచ్చు..!


Share

Related posts

NTR In Politics: తెలుగు రాజకీయం.. మారిన కథ ఇదే..!!

somaraju sharma

అమరావతిలో జగన్ పాదయాత్ర చేయగలరా?

Mahesh

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో భారీ టార్గెట్ ఫిక్స్ చేసిన జగన్..!!

sekhar