Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపిలో ఏ కార్యక్రమంలో మాట్లాడినా ఆ వెంటనేనో లేక పోతే మరుసటి రోజో పవన్ కళ్యాణ్ సామాజికవర్గ వైసీపీ నేతలు కౌంటర్ లు ఇవ్వడం రివాజుగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో శనివారం బీసీ నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మరుసటి రోజు కాపు నేతలతో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీలు, కాపుల పట్ల సర్కార్ అనుసరిస్తున్న తీరును విమర్శించారు. ఆ తర్వాతి రోజే మాజీ మంత్రి, మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని తనదైన శైలిలో పవన్ కళ్యాణ్ పై సెటైర్ లు వేశారు. రాజకీయాల్లో ఆస్కార్ అవార్డు కానీ ఉంటే నామినేషన్స్ కూడా లేకుండా అది ప్రతి సంవత్సరం పవన్ కే దక్కుతుందని వ్యంగ్యంగా విమర్శించారు. పవన్ కు ప్రజాసేవ చేయాలని లేదనీ, కమిట్ మెంట్ అంత కంటే లేదని అన్నారు. నెలలో రెండు రోజులు శని, ఆదివారాలు వస్తాడు.. ఏదేదో చెబుతాడు అని విమర్శించారు. ఆ తర్వాత విమానం ఎక్కగానే పవన్ మాట్లాడిన మాటలు అన్నీ గాల్లో కలిసిపోతాయన్నారు. పట్టుమని నాలుగు మాటలు మాట్లాడితే కులం అంటాడు.. మళ్లీ కుల రహిత సమాజం అంటాడనీ, పవన్ పొలిటికల్ నటనకు ఆస్కార్ కూడా తక్కువేనని సైటైర్ వేశారు పేర్ని నాని.

కాపులు, బీసీలు కలిసి ప్రభుత్వాన్ని మార్చాలని పవన్ కళ్యాణ్ అంటున్నాడనీ, అసలు వాళ్లద్దరూ ఎందుకు కలవాలి, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మార్చాలి అని ప్రశ్నించారు పేర్ని నాని. ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన ప్రతి పథకం, తీసుకున్న ప్రతి నిర్ణయం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల సంక్షేమం కోసమే కదా, అలాంటిది ఆయా వర్గాలన్నీ కలిసి తమకు మేలు చేసే ప్రభుత్వాన్ని ఎందుకు మార్చుకుంటారని పవన్ ఆలోచించలేకపోయాడా అని ప్రశ్నించారు. బీసీలు, కాపులు కలిస్తే బాబు సీఎం అవుతాడని పవన్ కళ్యాణ్ ఎందుకు ఆశ పడుతున్నారని అన్నారు. కాపుల ఆత్మాభిమానం తగ్గకుండా ఒప్పందాలు చేసుకుంటాను అంటే అర్ధం ఏమిటో పవన్ చెప్పాలన్నారు. కాపులు బీసీలకు, కాపులకు ఎస్సీలకు ఎక్కడైనా గొడవలు ఉన్నాయా లేవు కదా అని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు రాజకీయం కోసం మాలో మేము గొడవలు పడలా అని ప్రశ్నించారు. అలుపు సొలుపు లేకుండా 2014 నుండి చంద్రబాబుకు ఊడిగం చేస్తొంది పవన్ కళ్యాణ్ కాదా అని ప్రశ్నించారు.
కాపుల కోసం నిలబడిన నాయకుడు వైఎస్ జగన్ అని పేర్కొన్న పేర్ని..పేదల ఆర్ధిక సాధికారత కోసం జగన్ చిత్తశుద్దితో పని చేస్తున్నారని అన్నారు. పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే కాపుల సంక్షేమం కోసం రూ.30వేల కోట్లు ఖర్చు చేశారనీ, అలాంటి ప్రజా నాయకుడైన జగన్ కు కాపులు కేవలం 2019 ఎన్నికల్లోనే కాదు, 2024, 2029 లో కూడా వైసీపీకే మద్దతు ఇస్తారనీ, వైఎస్ జగనే గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు పేర్ని నాని. పాపం హరిరామ జోగయ్య ఆ వయస్సులో కూడా కాపు సంక్షేమ సమితి అంటూ కాపుల రాజకీయ ప్రయోజనాల కోసం కష్టపడుతుంటే.. పవన్ మాత్రం కమ్మ ప్రయోజనాల కోసం పని చేస్తానని చెప్పడం చాలా నీచమన్నారు. ఇలా పవన్ కళ్యాణ్ పై పేర్ని నాని సుదీర్ఘంగా విమర్శలు సంధించారు.
ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పూరైన వాదనలు.. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు..ట్విస్ట్ ఏమిటంటే..?