NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ సినిమా

Megastar Chiru: బ్రేకింగ్..చిరంజీవిపై విష ప్రయోగం..??

Megastar Chiru: తెలుగు సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాస్టార్ గా ఎదగడానికి ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే చిరు ఎదుగుదల చూసి ఓర్వలేక గతంలో ఆయనపై హత్యాయత్నం (విషప్రయోగం) జరిగిన విషయం నేడు చాలా మందికి తెలియదు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి పై గతంలో విష ప్రయోగం జరిగింది తెలుసా అంటూ ఓ మెగా అభిమాని సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు వైరల్ అయ్యింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలోనే చిరుపై విష ప్రయోగానికి యత్నం అంటూ ప్రచురితమైన ఓ పేపర్ క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నేడు తాజాగా చిరు జన్మదిన వేడుక సందర్భంగా ఆయన అభిమాని ఎన్పీ లక్కిరెడ్డి నాటి విషయాలను ప్రస్తావిస్తూ ట్విట్ చేశారు.

Poisoning on Megastar Chiru
Poisoning on Megastar Chiru

Megastar Chiru: ఎన్టీఆర్ ఏపి సీఎంగా ఉన్న సమయంలో..

1988లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగు సినీ ఇండస్ట్రీలో మూడు హిట్ లు కొట్టి నెంబర్ 1 హీరోగా చిరు ఉన్నారు. నాడు మరణ మృదంగం చిత్రీకరణలో చిరు పాల్గొంటున్నారు. ఆ రోజు మద్రాస్ బేస్ కోర్టులో షూటింగ్ జరుగుతోంది. అక్కడికి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. అందులో ఒక అభిమాని ఈ రోజు నా పుట్టిన రోజు అంటూ..ఎప్పటి నుండో మీ సమక్షంలో కేక్ కట్ చేయాలని అనుకుంటున్నాను, అంటూ ముందుకొచ్చాడు. దానికి చిరు అంగీకరించడంతో ఒక కేక్ ముక్క కట్ చేసిన అభిమాని దానిని వెంటనే చిరుకి బలవంతంగా తినిపించబోయాడు. అయితే అతడిని చిరు వారించినా వినకుండా చిరు నోట్లోనే కేక్ పెట్టేందుకు ట్రై చేశాడు. దాంతో అని నేల పాలు అయ్యింది. అలా నేలపైన పడిన ఆ కేక్ ముక్కలో గోధుమ రంగులో ఓ చిన్న ప్యాకెట్ బయటపడింది.

సీనీ పెద్దల జోక్యంతో సమసిన వివాదం

దాంతో మరణ మృదంగం చిత్ర యూనిట్ కంగారు పడింది. కేక్ మూలంగా చిరు పెదాలు రంగు మారడంతో విష ప్రయోగం జరిగి ఉంటుందని భావించి హుటాహటిన ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. ఆ తరువాత రోజు రాష్ట్ర, జాతీయ న్యూస్ పేపర్ లలో మొదటి పేజీలో చిరుపై విషప్రయోగం యత్నం అంటూ ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఈ ఘటన నాడు హాట్ టాపిక్ అయ్యింది. చిరు ఎదుగుదలను సహించలేని వారి కుట్ర అంటూ ప్రచారం సాగింది. ఆ తరువాత సినీ పెద్దల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. చిరు మెగాస్టార్ కావడానికి ఎన్ని అడ్డంకులు అధిగమించారో అర్థం చేసుకోండి అంటూ పేర్కొన్న లక్కీరెడ్డి  చిరుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella