Sajjala Ramakrishna Reddy: పీఆర్సీతో సహా పలు డిమాండ్ల సాధన కోసం ఏపి ఎన్జీఓల సంఘాల నేతలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో ఉద్యోగి కుటుంబంలో అయిదు ఓట్లు ఉంటాయి. ఏపి వ్యాప్తంగా 13 లక్షల ఉద్యోగులు ఉన్నారు. కుటుంబాలతో కలుపుకుని 60 లక్షల ఓట్లు ఉన్నాయి. తాము తలుచుకుంటే ప్రభుత్వాన్ని పడగొట్టగలం, నిలబెట్టగలం, ఉద్యోగుల శక్తి ముందు ఎవరైనా తలవంచాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలను ఏపి ఎన్జీఓ సంఘ నేత బండి శ్రీనివాసరావు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. కొంత మంది నాయకులు మాట్లాడిన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బహుశా వాళ్లల్లో ఒక ఊపు కోసం అలా మాట్లాడి ఉండవచ్చు అని అభిప్రాయపడ్డారు. వాళ్లు నలుగురే ఉద్యోగులు కాదు కదా, ఒక వేళ వాళ్లు నిర్ణయక శక్తి అనుకుంటే రాజకీయాల్లోకి వెళ్లొచ్చు అని కౌంటర్ ఇచ్చారు సజ్జల.
“ఉద్యోగులు ప్రజల్లో భాగం, పైగా ఉద్యోగులు ప్రభుత్వంలోనూ భాగం, రాజకీయ పార్టీల నేతలు ప్రభుత్వంలో అయిదేళ్లు పాటు గెస్ట్ గా ఉండారు తప్ప వాళ్లు పదవీ విరమణ అయ్యే వరకూ ప్రభుత్వంలో ఉంటారు. రాజకీయ పార్టీగా సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం తీసుకునే విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి అమలు చేసేది ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ల మీద ప్రేమే ఉంటుంది. వాళ్లు పూర్తి సంతృప్తితో పని చేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వం అనుకుంటుంది తప్ప వేరేది ఏమీ ఉండదు. గతంలో చంద్రబాబు పిఆర్సీ అమలు చేయకుండా, డీఏలు ఇవ్వకుండా వెళ్లిపోతే ఈ ప్రభుత్వం రాగానే ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ చేసిన ఘనత జగన్మోహనరెడ్డి దని” ఆయన గుర్తు చేశారు. కోవిడ్ మూలంగా ఆదాయం తగ్గిపోయి ఖర్చు విపరీతంగా పెరిగిపోవడం, గతంలో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించాల్సి రావడం, ఆర్ధిక వ్యవస్థపై పూర్తి ప్రభావం పడటం వల్ల సహజంగా అన్నింటి మీద ఆ ప్రభావం పడింది. ఉద్యోగుల మీద కూడా కొంచెం పడిందన్నారు. వాళ్లు కూడా చాలా ఓపికతో వేచి చూశారన్నారు. వాళ్లు అడుగుతున్న దానిలో ఏమీ తప్పులేదు. పీఆర్సీ గురించి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అది కూడా అయిపోతుంది. త్వరలో అనౌన్స్ చేయడం జరుగుతుందని సజ్జల పేర్కొన్నారు. వాళ్లు చేసిిన వాఖ్యలకు విలువ ఉందని తాను అనుకోవడం లేదన్నారు. ఎవరికి వాళ్లు మేము చేయగలమని అనుకుంటే ప్రజాస్వామ్యంలో ఆ గ్రూపే కంట్రోల్ చేయగలిగితే వాళ్ల ఒక్కరిని సంతృప్తి పర్చి ప్రభుత్వాలను నడుపుకోవచ్చు. బహుశా వాళ్లు ఒక ఊపు కోసం అలా మాట్లాడి ఉండవచ్చు. ఆదే వాళ్లు అనుకుని నిజం ఉంటే వాళ్లు పార్టీ పెట్టి పొలిటికల్ గా రావచ్చు అని సజ్జల అన్నారు.
దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…
ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…
రీసెంట్గా `సర్కారు వారి పాట`తో మరో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో మాస్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం…
హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…