Supreme Court: అమరావతి ఆర్ – 5 జోన్ లో ఇళ్ల నిర్మాణాల అంశంపై సుప్రీం కోర్టులో ఏపీ సర్కార్ కు ఊరట లభించలేదు. ఆర్ – 5 జోన్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఆర్ – 5 జోన్ లో ఇళ్ల నిర్మాణం చేపట్టవద్దంటూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. తాజాగా ఈ పిటిషన్ పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘ్వీ వాదనలు వినిపించారు. అయితే విచారించాల్సిన అంశాలు చాలా ఉన్నందున తదుపరి విచారణ చేపతామని పేర్కొన్న ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరో మూడు వారాల్లో రిజాయిండర్ పిటిషన్ దాఖలు చేయాలని పిటిషనర్లను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ లో చేపడతామని ధర్మాసనం వెల్లడించింది.
CM YS Jagan: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రాష్ట్రంలోనే – సీఎం జగన్