NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రాష్ట్రంలోనే – సీఎం జగన్

CM YS Jagan: రాష్ట్రంలో కౌలు రైతులకు రైతుభరోసా నిధులు నేడు విడుదల అయ్యాయి. తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ వర్చువల్‌గా బటన్‌ నొక్కి నిధుల్ని జమ చేశారు. రాష్ట్రంలోని 1,46,324 మంది కౌలు రైతులకు రూ.109.74 కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కౌలు రైతులకు తోడుగా నిలబడే ప్రభుత్వం బహుశా ఎక్కడా లేదేమమోనని అన్నారు.  దేశంలోనే తొలిసారిగా కౌలు రైతులతో పాటు దేవదాయ, అటవీ భూములను సాగు చేస్తున్న వాస్తవ సాగు దారులకు కూడా వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని వర్తింపచేస్తోందని అని సీఎం తెలిపారు. పంట హక్కు సాగు పత్రాలు పొందిన వారిలో అర్హులైన.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలుదారులు, అలాగే.. దేవదాయ భూములను సాగు చేస్తున్న రైతులకు ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున సాయం పంపిణీ చేస్తోందని చెప్పారు. 2023–24 సీజన్‌కు సంబంధించి తొలి విడత పెట్టుబడి సాయం ఇదని రైతులకు సాయం చేయటం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

మనందరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో భూ యజమానులకు వైయస్ఆర్‌ రైతు భరోసా కింద ఏటా.. రూ.13,500 చొప్పున పెట్టు­బడి సాయాన్ని అందిస్తోందని, మే నెలలో రూ.7,500, అక్టోబర్‌లో రూ.4 వేలు, జనవరిలో రూ.2 వేలు చొప్పున మూడు విడతల్లో ఈ సాయాన్ని జమ చేస్తోందని రైతన్నలు బాగుండాలనే ఈ పథకం చేపట్టినట్లు సీఎం వివరించారు. ఇప్పటి వరకు 5,38,227 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కౌలుదారులు, 3,99,321 మంది అటవీ భూమి సాగుదారులకు నేటితో మొత్తం రూ.1,122.85 కోట్ల పెట్టుబడి సాయం అందించామని తెలిపారు. మొత్తంగా అందరికీ కలిపి ఇప్పటి వరకు పథకం ద్వారా 52.57 లక్షల రైతు కుటుంబాలకు రూ.31,005.04 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని అందించామని సీఎం పేర్కొన్నారు.

ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ లో సాయం

ఫడ్ రిలీఫ్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే రూ.38కోట్లతో రైతులకు సాయం చేశామని, వరదల వల్ల నష్టపోయిన రైతన్నలకు నారుమడులు, నాట్లు వేసిన పొలాల రైతులందరికీ వెనువెంటనే వారిని ఆదుకుంటున్నామని సీఎం తెలిపారు. రైతుల పక్షపాత ప్రభుత్వంగా ఈ 50 నెలల కాలంలోనే విప్లవాత్మక మార్పులు మన రాష్ట్రంలో చూడగలిగామని అన్నారు. ఏ పంట వేసినా ఈ క్రాప్, ఇన్సూరెన్స్‌ నమోదవుతోందన్నారు.  రైతులు కట్టాల్సింది కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తొందని చెప్పారు. రైతులకు ఉచిత విద్యుత్ 9 గంటల పాటు పగటిపూటే ఇచ్చే కార్యక్రమం జరుగుతోందన్నారు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత పగటిపూటే 9 గంటలు కరెంటు ఇవ్వాలంటే రూ.1,700 కోట్లు పెట్టి ఫీడర్లు అప్‌గ్రేడ్‌ చేయాలని డిపార్ట్‌మెంట్‌ చెబితే ఆ డబ్బు పెట్టి ఫీడర్లను అప్‌గ్రేడ్‌ చేసి పగటిపూటే కరెంటు ఇస్తున్నామని తెలిపారు.

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju