NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి సీఎస్ రేసులో అనూహ్యంగా కొత్త పేరు ..! సీఎం జగన్ తో ఆ కేంద్ర అధికారి భేటీ అందుకేనా..!?

ఏపి ప్రభుత్వప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెల 30వ తేదీతో ముగియనున్నది. ఆయన రిటైర్ అవుతున్న నేపథ్యంలో కొత్త సీఎస్ గా ప్రస్తుతం ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రదాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి నియమితులు కానున్నారని ప్రచారం జరుగుతున్నది. తొలుత ఓబులాపురం మైనింగ్ కేసులో క్లీన్ చిట్ లభించిన సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి పేరు సీఎస్ రేసులో వినిపించినా రీసెంట్ గా జవహర్ రెడ్డికే సీఎం జగన్ అవకాశం ఇవ్వనున్నట్లు ప్రచారం జరిగింది. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయంటూ వార్తలు వచ్చాయి.

Seniour IAS Giridhar Meets AP CM YS Jagan

 

అయితే అనూహ్యంగా కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం ఏమిటంటే.. కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ గిరిధర్ ఆర్మాణే .. శనివారం సీఎం వైఎస్ జగన్ భేటీ అయ్యారు. , ఆయనకు సీఎం జగన్ దుశ్సాలువాతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. కొత్త సీఎస్ కోసం కసరత్తు జరుగుతున్న క్రమంలో గిరిధర్ సీఎం జగన్ తో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరో పక్క ఆయనను రక్షణ శాఖ (కేంద్ర సర్వీసు) నుండి రిలీవ్ చేయాలని కూడా ఏపి సర్కార్ కేంద్రానికి లేఖ రాసినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో గిరిధర్ సీఎస్ రేసులో ఉన్నట్లుగా చెబుతున్నారు. గిరిధర్ 1988 బ్యాచ్ కి చెందిన అధికారి.

సీనియారిటీలో మాత్రం సమీర్ శర్మ తర్వాత నీరభ్ కుమార్ ప్రసాద్, గిరిధర్, పూనం మాలకొండయ్య, కరికాల వలవన్ ఉన్నారు. అయితే ఇప్పటి వరకూ 1988 బ్యాచ్ కి చెందిన శ్రీలక్ష్మి, 1990 బ్యాచ్ కి చెందిన జవహర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా సీఎస్ రేసులో వినిపించాయి. తాజాగా గిరిధర్ సీఎం జగన్ తో భేటీ కావడంతో సీఎం జగన్ ఎవరికి అవకాశం ఇస్తారు అనేది అసక్తికరంగా మారింది.

TRS Vs BJP: బాబును చూసి నేర్చుకోలేదా..!? కేసిఆర్ దగ్గర కౌంటర్ ప్లాన్ లేదా..!?

Related posts

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N