NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Supreme Court: సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు ఊరట

Supreme Court: సుప్రీం కోర్టులో జగన్ సర్కార్ కు ఊరట లభించింది. విశాఖ రిషికొండ పై పర్యాటక శాఖ భవన నిర్మాణాలపై ఎన్‌జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని కోరుతూ ఏపి సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. రుషి కొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే నిర్మాణాలు ఉన్న ప్రాంతంలో యథావిధిగా నిర్మాణాలు చేసుకోవచ్చని తెలిపిన కోర్టు..తవ్వకాలు చేసిన ప్రదేశంలో నిర్మాణాలు చేయవద్దని తెలిపింది. కేసులోని మెరిట్స్ పై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదని వెల్లడిస్తూ.. కేసు విచారణను ఏపి హైకోర్టుకు బదిలీ చేసింది.

Supreme Court Key Orders on rushikonda Constructions
Supreme Court Key Orders on rushikonda Constructions

Supreme Court: రుషికొండ నిర్మాణాల కేసు హైకోర్టుకు బదిలీ

ట్రిబ్యునల్ పరిధి కంటే హైకోర్టు పరిధి ఎక్కువని చెప్పిన సుప్రీం కోర్టు..హైకోర్టు ఆదేశించినప్పటికీ ఎన్జీటీ బేఖాతరు చేయడం తగదని హితవు పలికింది. హైకోర్టు, ఎన్జీటీ పరస్పర విరుద్ధ ఆదేశాలతో యంత్రాంగంలో గందరగోళం నెలకొందని, రాజ్యాంగ బద్ద సంస్థ కాబట్టి హైకోర్టు ఉత్తర్వులే అమలు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అప్పటి వరకూ ఎన్జీటీ విచారణ జరపరాదని ఆదేశించింది సుప్రీం కోర్టు. పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి తదిపరి విచారణ హైకోర్టులో జరుగుతుందని, పిటిషనర్ల అభ్యంతరాలు అక్కడ చెప్పుకోవాలని సూచించింది. గతంలో రిసార్టు ఉన్న పాంతంలో పాత భవనాలు తొలగించిన చోట మాత్రం నిర్మాణాలు జరపడానికి వెసులుబాటు ఇస్తున్నట్లు తెలిపింది.

ఎన్జీటీ విచారణకు బ్రేక్

రుషికొండపై అక్రమంగా తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయని పేర్కొంటూ నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజు గత ఏడాది ఎన్జీటీలో దాఖలు చేసిన పిటిషన్ పై గత నెల 6వ తేదీన విచారణ జరిపింది. రుషికొండపై తవ్వకాలపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తూ నెల రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వెలవడే వరకూ ఎలాంటి తవ్వకాలు, నిర్మాణాలు జరపరాదని ఏపి ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. ఎన్జీటీ ఉత్వరులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా పై ఆదేశాలు జారీ చేసింది.

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N