NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Vs Janasena: టీడీపీ – జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయ భేటీ రసాభాస ..పిఠాపురం సమస్యను ఎలా పరిష్కరిస్తారో..!

TDP Vs Janasena: రాష్ట్ర స్థాయిలో టీడీపీ – జనసేన పార్టీలు పొత్తుతో ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణకు సిద్దమయ్యాయి. ఇప్పటికే రెండు సార్లు ఇరుపార్టీల నేతలు సమావేశమయ్యారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టీడీపీ – జనసేన నేతల మధయ్ సమన్వయం కుదరడంతో ఇక నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర జేఏసీ సూచించింది. దీంతో నియోజకవర్గ స్థాయి సమావేశాలు ప్రారంభమైయ్యాయి. రాష్ట్ర, జిల్లా స్థాయిలో టీడీపీ – జనసేన పార్టీల సమన్వయ భేటీలు సక్రమంగా జరిగినప్పటికీ క్షేత్ర స్థాయిలో ఆ సమన్వయం కొనసాగే పరిస్థితులు కొన్ని చోట్ల కనిపించడం లేదు. టీడీపీ, జనసేన బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఇరు పార్టీల నేతలు పోటీ చేయాలని భావిస్తుండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి.

టీడీపీ – జనసేన పొత్తులో భాగంగా ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలన్న దానిపై ఇంకా పార్టీలు నిర్ణయించలేదు. అయితే పలు నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన నేతలు తామే అభ్యర్ధులుగా ఇప్పటి నుండి ప్రచారం చేసుకుంటున్నారు. ఇటువంటి నియోజకవర్గాల్లో ముఖ్యనేతలతో పార్టీ పెద్దలు ముందుగా సమావేశాలు నిర్వహించకపోవడంతో క్షేత్ర స్థాయిలో ఘర్షణలు తలెత్తుతున్నాయి. తాజాగా మంగళవారం పిఠాపురంలోని పాత టీడీపీ ఆఫీసు వద్ద జరిగిన రెండు పార్టీల సమన్వయ కమిటీ సమావేశం రసభాసగా మారింది.

గత ఎన్నికల్లో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ ఓడిపోయినందున ఈ సారి సీటు తనకు ఇవ్వాలని నియోజకవర్గ జనసేన ఇన్ చార్జి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కోరారు. ఆ సమయంలో వర్మ కలుగజేసుకుని..గత ఎన్నికల్లో తానే కాదు..మహామహులే ఓడిపోయారని వ్యాఖ్యానించారు. దీంతో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించే వర్మ వ్యాఖ్యానించారని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడ్డారు. తమ అధినేతను వర్మ అవమానించారని జనసైనికులు మండిపడ్డారు. జనసేన – టీడీపీ నేతల పరస్పర దూషణలతో, గలాటతో కుర్చీలు, బెంచీలను పడేయడంతో ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించింది. ఇరుపార్టీల నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వారి మాటలు పట్టించుకోకుండా కార్యకర్తలు అక్కడి నుండి వెళ్లిపోయినట్లు తెలుస్తొంది.

పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుండి పోటీ చేసిన వంగా గీత టీడీపీ అభ్యర్ధి వర్మపై వెయ్యి ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ వర్మకు టికెట్ ఇవ్వకుండా పీవీ విశ్వంకు టికెట్ ఇవ్వగా, వర్మ స్వతంత్ర అభ్యర్ధి గా పోటీ చేసి వైసీపీ అభ్యర్ధి దొరబాబుపై 47వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ అభ్యర్ధి విశ్వంకు కేవలం 15వేల ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వర్మ టీడీపీలోనే కొనసాగారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరుపున వర్మ పోటీ చేయగా, వైసీపీ అభ్యర్ధి దొరబాబు 14,992 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జనసేన పార్టీ నుండి పోటీ చేసిన శేషు కుమారికి 28వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 15 శాతం ఓట్లు జనసేనకు పోల్ అవ్వడంతో ఆ ఓట్ల చీలిక కారణంగా వర్మ ఓటమి పాలైయ్యారు.

ఈ నియోజకవర్గంలో జనసేన – టీడీపీ సమన్వయంతో ఉమ్మడి అభ్యర్ధి పోటీ చేసే విజయం ఖాయమనే మాట వినబడుతుండగా, ఇక్కడ సమన్వయమే ప్రధాన సమస్యగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరుపున పోటీ చేసి ఓటమి పాలైన శేషు కుమారిని తప్పించి ఆమె స్థానంలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది జనసేన పార్టీ. నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉండటంతో జనసేన అభ్యర్ధి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయడం ఖాయమని భావిస్తుండగా, టీడీపీ నేత వర్మ టికెట్ ఇవ్వకపోతే మళ్లీ స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగే అవకాశం ఉందని అంటున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే టీడీపీ – జనసేన అధిష్టానానికి సమన్వయపర్చడం పెద్ద తలనొప్పిగా తయారవుతోందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..!

BTech Ravi: పోలీసుల అదుపులో పులివెందుల టీడీపీ నేత బీటెక్ రవి..?

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju