Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెండు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. ఏసీబీ కోర్టు అనుమతితో సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలోని అధికారుల బృందం నిన్న, ఇవేళ రాజమండ్రి సెంట్రల్ జైల్ లో చంద్రబాబును విచారించించారు. విచారణ ముగిసిన తర్వాత కోర్టుకు వర్చువల్ గా హజరు పర్చాలని కోర్టు ఆదేశించింది. విచారణ ముగిసిన తర్వాత వైద్య పరీక్షలు జరిపి చంద్రబాబును న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు.

కాగా కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ కోరింది. దీనిపై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి స్పందిస్తూ .. పిటిషన్ దాఖలు చేయాలని, పిటిషన్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని తెలిపింది. మరో మూడు రోజులు సీఐడీ కస్టడీకి కోరుతున్న క్రమంలో చంద్రబాబు తరపున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. కస్టడీ పొడిగింపుపై సీఐడీ పిటిషన్ దాఖలు చేస్తే వాదనలు వినాలని పోసాని కోరగా, సీఐడీ పిటిషన్ తర్వాత అవసరమైతే కౌంటర్ వేయాలని న్యాయమూర్తి సూచించారు.

చంద్రబాబును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు సీఐడీ అధికారులు వర్చువల్ గా హజరుపర్చగా, విచారణ సమయంలో ఏమైనా ఏమైనా ఇబ్బంది పెట్టారా తదితర విషయాలపై న్యాయమూర్తి ప్రశ్నించగా, తనకు ఇబ్బంది పెట్టలేదని చంద్రబాబు చెప్పినట్లుగా తెలుస్తొంది. చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ గడవు నేటితో ముగియడంతో న్యాయమూర్తి .. చంద్రబాబు రిమాండ్ ను అక్టోబర్ 5వ తేదీ వరకూ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ కస్టడీ పొడిగింపుపై ఇవేళ ఎటువంటి ప్రస్తావన జరగలేదు. కాగా, చంద్రబాబు కు సంబంధించి మధ్యంతర బెయిల్, బెయిల్ పిటిషన్ల పై రేపు విచారణ జరగనుంది.
Breaking: సినీ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు.. డైరెక్టర్, రచయిత అరెస్టు