NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ సినిమా

Breaking: సినీ ఇండస్ట్రీలో మళ్లీ డ్రగ్స్ ప్రకంపనలు.. డైరెక్టర్, రచయిత అరెస్టు

Share

Breaking: సినీ ఇండస్ట్రీలో మళ్లీ ప్రకంపనలు రేగుతున్నాయి. మాదాపూర్ డ్రగ్స్ కేసులో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. రెండు నెలల క్రితం సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్టు అవ్వగా, గత నెల 31న బాలాజీ, రాంకిశోర్, సినీ ఫైనాన్షియర్ వెంకటరత్నారెడ్డి, మురళీలను అరెస్టు చేశారు. వారి నుండి సేకరించిన సమాచారం ఆధారంగా రీసెంట్ గా ముగ్గురు నైజీరియన్లు సహా మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేశ్ రావు, రాంచందర్, కే సందీప్, సుశాంత్ రెడ్డి, శ్రీకర్, కృష్ణప్రసాద్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

నిందితుల నుండి సేకరించిన సమాచారంతో నార్కోటిక్ పోలీసులు నిన్ననే హీరో నవదీప్ ను విచారణ జరిపారు. నవదీప్ ఫోన్ లో ఛాటింగ్, మెసేజ్ లు డిలీట్ చేసి ఉండటంతో వాటిని రికవరీ చేసేందుకు పోలీసులు ఆయన సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ మరుసటి రోజే (ఆదివారం) సినీ ఇండస్ట్రీకి చెందిన ఇద్దరిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. బస్తీ చిత్ర దర్శకుడు మంతెన వాసు వర్మ, రచయిత మన్నేరి పృథ్వీ కృష్ణను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 70 గ్రాములు కొకైన్, విదేశీ మద్యం, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఇప్పటికే అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దూకుడు పెంచారు. నిందితుల్లో రాంచందర్ అనే వ్యక్తి ద్వారా సినీ ఇండస్ట్రీ కి చెందిన పలువురు పేర్లు బయటకు వచ్చాయి. దీంతో అసలు డ్రగ్స్ ఎవరు తెస్తున్నారు ? ఎవరెవరికి విక్రయిస్తున్నారు ? డ్రగ్స్ సరఫరా వెనుక ఉన్న సూత్రదారులు ఎవరు? అనే విషయాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు మరి కొంత మందికి నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తొంది.

Chandrababu Arrest RGV: చంద్రబాబుపై ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్ ..సోషల్ మీడియాలో వైరల్


Share

Related posts

Shyam singha roy: ఇంత టిపికల్ స్క్రీన్ ప్లే అయితే దెబ్బైపోతుందేమో..!

GRK

ఈసీ × వ్యవస్థ! ఏపీ సంక్షోభం కొత్త సవాల్!!

Comrade CHE

Breaking: అక్రమ నిర్మాణాలు కూల్చివేత.. అబ్దుల్లాపూర్ మెట్ లో ఉద్రిక్తత

somaraju sharma