NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: టీడీపీలో గాలి కబుర్లు.. బాబుని కలిసి.. సీటు అంటూ సొంత బాకాలు..!?

Tdp leaders fake prapakanda

Chandrababu:  ఏపీ రాజకీయాల్లో టీడీపీ ఇప్పుడు చావుబతుకుల మధ్య ఉంది.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి అధికారం రాకపోతే పార్టీ మూలాలకే ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది.. సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలు.. తీసుకుంటున్న నిర్ణయాలు.. టీడీపీ విషయంలో వేస్తున్న ప్రణాళికలు తట్టుకోవడం కష్టంగానే ఉంది..బాబులో చతురత, చాణక్యత అంతా ప్రయోగిస్తున్నా సాధ్యమవడం లేదు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎంత ముఖ్యమో.. జగన్ ని ఎదుర్కోవడం ఎంత కష్టమో.. ఎన్నికల్లో వ్యూహాత్మక అడుగులు వేయడం ఎంత రిస్కు అనే విషయం చంద్రబాబు సహా నేతలు అందరికీ తెలుసు కాబట్టి టికెట్ కేటాయింపు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. కానీ కొత్త నేతలు మాత్రం కాస్త గట్టు దాటుతూ.. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త ప్రచారాలకు తెరతీస్తున్నారు. పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతున్నారు..!

Tdp leaders fake prapakanda
Tdp leaders fake prapakanda

Chandrababu:  సమీక్షకు కలిస్తే సీటు వచ్చేసినట్టేనా..!?

టీడీపీలో టికెట్ కేటాయించేది చంద్రబాబు.. ఆ ప్రకటన అధికారికంగా చేసేది చంద్రబాబు లేదా అచ్చెన్నాయుడు.. కానీ ఇటీవల కొందరు నియోజకవర్గ ఇంచార్జిలు చంద్రబాబుని కలిసి వచ్చిన వెంటనే సీటు ఖరారయింది అంటూ ప్రచారం చేసుకుంటూ సోషల్ మీడియాలో సొంత డప్పులు కొట్టుకోవడం పార్టీలో అంతరాలను పెంచుతుంది.. టీడీపీలో ప్రస్తుతానికి 19 మంది సిటింగ్ ఎమ్మెల్యేలకు మాత్రమే సీట్లు మళ్ళీ ఖరారు చేసారు. డోన్, రాజంపేట, పీలేరు లాంటి కొన్ని చోట్ల మాత్రమే బాబు స్వయానా ప్రకటించారు.. దాదాపు మిగిలిన ఏ నియోజకవర్గాల్లో కూడా చంద్రబాబు అభ్యర్థుల విషయంలో ఒక స్పష్టతకు రాలేదు.. కానీ కొందరు ఇంచార్జిలు మాత్రం సొంత డబ్బాలతో హోరెత్తించడం పార్టీలో చికాకు తెప్పిస్తుందని సమాచారం.. కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే..

ఏపి అసెంబ్లీ ఆఖరి రోజు టీడీపీ సభ్యులు సస్పెన్షన్

* గతంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా.., ప్రస్తుత నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి ఇంటూరి నాగేశ్వరరావు.. ఈయనకు ఆ బాధ్యత ఇచ్చి ఏడు నెలలు కావస్తుంది.. ఆయన కూడా ఉన్నంతలో బాగానే పని చేసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు, విధానాలతో జనంలో తిరుగుతున్నారు.. బాగానే కష్టపడుతున్నారు, డబ్బు కూడా పెడుతున్నారు.. కాకపోతే అక్కడ ఆయనకు వ్యతిరేక వర్గాలు బలంగా ఉన్నాయి. ఆయన కంటే ముందే పార్టీలో కీలక సమయంలో కార్యకర్తలకు అండగా ఉంటూ.. భారీగా సొంత కార్యక్రమాలు చేసిన ఇంటూరి రాజేష్ ఇంచార్జి పదవి ఆశించి భంగపడ్డారు.. సో ఇప్పుడు టికెట్ విషయంలో ఇద్దరూ ఆశతో ఉన్నారు. ఈ ఇద్దరితో పాటూ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా సైలెంట్ గా ఆశిస్తున్నారని సమాచారం.. అయితే తాజాగా చంద్రబాబుని కలిసిన ఇంటూరి నాగేశ్వరరావు “తనకు బాబు గారు టికెట్ ఖరారు చేశారు” అని చెప్పుకోవడం, ఆయన వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం పార్టీ పెద్దల దృష్టికి చేరింది. పార్టీ కార్యక్రమాల సమీక్షకు పిలిపించి మాట్లాడితే ఇలా టికెట్ ఖరారు అంటూ ప్రచారాలు అవసరమా అంటూ పార్టీలో కొందరు పెదవి విరుస్తున్నారు..!

Tdp leaders fake prapakanda
Tdp leaders fake prapakanda

* ఇదే తరహాలో ప్రొద్దుటూరు ఇంచార్జి ప్రవీన్ కుమార్ రెడ్డి కూడా.. నిజానికి ఇక్కడ కూడా ఎవరికీ టికెట్ ఇవ్వాలో పార్టీ అంతర్గతంగా ఒక అంచనాకు రాలేకపోతుంది. దాదాపు 90% ప్రవీణ్ కుమార్ కె ఖరారయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ మరో రెండు పేర్లు పరిశీలనలో ఉన్నారు.. చివరి నిమిషంలో మార్పులు ఉండవచ్చు అంటున్నారు. కానీ ఈయన కూడా పార్టీ సమీక్షకు పిలిపిస్తే టికెట్ ఖరారు అంటూ చెప్పేసుకున్నారు..!

* జగ్గయ్యపేట నియోగాజకవర్గం విషయంలో కూడా ఇదే స్పష్టత మిస్ అవుతుంది.. అక్కడ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మాజీ ఎమ్మెల్యే.. ఆయనే సీటు ఆశిస్తున్నారు.. కానీ ఆయనకు వ్యతిరేక వర్గాలు బలంగా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో కమ్మ సామాజికవర్గం తమకు సీటు కేటాయించాలని కోరుతుంది.. కాపు సామాజికవర్గం కూడా వైసీపీలో కాపులకు సీటు ఇస్తున్నారు కనుక.. టీడీపీ కూడా కాపులకు ఇవ్వాలంటూ కోరుతున్నారు.. సో.., ఇది కూడా చంద్రబాబు ఎటూ ఖరారు చేయలేకపోతున్నారు..! కానీ ఈయన కూడా బాబుని కలిసిన గంటలోనే టికెట్ తనకు ఖరారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం పార్టీ విసుక్కున్నట్టు సమాచారం.

Tdp leaders fake prapakanda
Tdp leaders fake prapakanda

 బాబు పిలిచేది ఎందుకంటే..!?

చంద్రబాబు ఇప్పుడు పార్టీ ఇంచార్జిల విషయంలో సీరియస్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణను తరచూ సమీక్షిస్తున్నారు. ఎవరు ఎన్ని రోజులు, ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో నిత్యం పర్యవేక్షిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారు. అందుకే.., ఆ కార్యక్రమాలపై సమీక్షకు మాత్రమే పార్టీల ఇంచార్జిలను పిలిపించి పర్సనల్ గా మాట్లాడుతున్నారు.. నాలుగు గోడల మధ్య .. ఆ ఇద్దరి మధ్య మాత్రమే జరిగే సంభాషణని “మాకు టికెట్ ఇచ్చేసారు.. బాగా చేసుకోమన్నారు” అంటూ చెప్పుకోవడంతో ఆ నియోజకవర్గాల్లో శ్రేణులు అస్పష్టతకు గురవ్వడమే కాక.. పార్టీలో కక్కుర్తి వ్యవహారాలను కూడా ఉదాహరిస్తోంది..!

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N