25.7 C
Hyderabad
April 1, 2023
NewsOrbit
Politics ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

AP Budget 2023-24: ఏపీ అసెంబ్లీలో ₹2,79,279 కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్..!!

Share

AP Budget 2023-24: మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు అభివృద్ధే లక్ష్యంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. శాసనసభలో 2023-2024 ఆర్థిక ఏడాదికి మొత్తంగా ₹2,79,279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ మంత్రి బుగ్గన ప్రవేశపెట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తిస్థాయి బడ్జెట్ కావటంతో పాటు మరో ఏడాదిలో ఎన్నికలు వస్తూ ఉండటంతో… బడ్జెట్ లెక్కలు బట్టి చూస్తే సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నవరత్నాలకీ  అధిక ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు మహిళలు, పిల్లలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో మొదట పోతన భాగవత పద్యాన్ని బుగ్గన చదివి వినిపించారు. అదే రీతిలో రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను కూడా ఉదాహరించి… బడ్జెట్ లో పేద ప్రజలు మరియు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టం చేశారు. విద్య, వైద్య, మౌలిక సదుపాయాలకి అధిక ప్రాధాన్యత కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఉన్న పథకాలు బలపరిచేలా మరింత మందికి అవకాశం ఇచ్చే రీతిలో బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్లు స్పష్టం చేశారు. అనంతరం బడ్జెట్ కేటాయింపులు చదివి వినిపించారు.

The Finance Minister Buggana Rajendranath presented the annual budget in the AP Assembly

 

ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం
జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు​​​​​

జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధికి రూ.15,873 కోట్లు
పురపాలక పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్ డెవలప్‌మెంట్ రూ.1,166 కోట్లు
లా నేస్తం రూ.17 కోట్లు

యువజన అభివృద్ధా, పర్యాటకం, సాంస్కృతి శాఖ రూ.1,291 కోట్లు
షెడ్యూలు కులాల కాంపొనెంట్ కోసం రూ.20,005 కోట్లు
వైఎస్ఆర్ కల్యాణ మస్తు రూ.200 కోట్లు
వైఎస్‌ఆర్ ఆసరా రూ.6,700 కోట్లు
షెడ్యూల్ తెగల కాంపొనెంట్ కోసం రూ.6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల కాంపొనెంట్ కోసం రూ.38,605 కోట్లు
వైఎస్ఆర్ చేయూత రూ.5వేల కోట్లు

అమ్మ ఒడి రూ.6,500 కోట్లు
మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.3 వేల కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ రూ.1,212 కోట్లు
వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం కోసం రూ.15,882 కోట్లు
కాపు సంక్షేమం రూ.4,887 కోట్లు
మైనార్టీల సంక్షేమం రూ.4,203 కోట్లు
మన బడి నాడు నేడు రూ.3,500 కోట్లు
పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు

పరిశ్రమలు, వాణిజ్యం రూ.2,602 కోట్లు
రోడ్లు, భవనాలు శాఖ రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్దికి రూ.11,908 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైఎస్ఆర్ కాపు నేస్తం రూ.550 కోట్లు
జగనన్న చేదోడు రూ.350 కోట్లు
వైఎస్ఆర్ వాహన మిత్ర రూ.275 కోట్లు


Share

Related posts

MP Raghu Rama: జగన్ బెయిల్ రద్దు పిటిషన్.. హైకోర్టు తీర్పు రేపటికి వాయిదా..!!

somaraju sharma

YS Jagan: జగన్ కి మూడు నెలలు సవాళ్లే..! కష్టాలు మామూలుగా లేవు..!!

Muraliak

Nimmagadda Ramesh Kumar : ఆ ఇద్దరు ఉన్నతాధికారులకు బదిలీ వేటు లేనట్లే..!!

somaraju sharma