Intinti Gruhalakshmi: వాసు వాళ్లకి తులసి మజ్జిగ లో జీలకర్ర వేసి కలిపి ఇస్తుంది. అబ్బా నీ చేతి మజ్జిగ కూడా అమృతం అమ్మ అంటూ వాసు లొట్టలేసుకుంటూ తాగేసి సరే ఇంక నేను నిద్రపోతాను అని వాసు అంటాడు. అన్నయ్య మీరు ఈ గదిలో నిద్రపోండి అని వాళ్ళకి గెస్ట్ రూమ్ లో చూపిస్తుంది. ఇక నందు లాస్య వెనకమాల వెళ్ళిపోతూ ఉండగా అదేంటి రా నీ భార్య ఎవరు అని వాసు నిడదీస్తాడు నందుని..

అదేంటిరా అలా అడుగుతావు తులసినే అని నందు అంటాడు. అలా అయితే నువ్వు తులసి తో పాటు తులసి గదిలోకి వెళ్ళకుండా ప్లాస్టిక్ తో పాటు తన రూమ్ లోకి వెళ్తావ్ ఏంటి అని నిలదీస్తాడు వాసు.. ఆ అవును కదా మర్చిపోయాను అంటూ తులసి రూములోకి బిత్తర బిత్తర చూపులు చూసుకుంటూ వెళ్తాడు నందు. లాస్య లోలోపల తిట్టుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.

లాస్యతన గదిలోకి వెళ్ళిన మొదలు నందు ఎక్కడ తులసికి దగ్గర అయిపోతాడోనని.. కాలు కాలిన పెళ్లి లాగా ఆ రాత్రంతా అటు ఇటు తిరుగుతుంది. నందుని మంచం మీద పడుకోమని చెబుతోంది. తులసి నువ్వు నాకోసం కింద పడుకుంటావా అని అడగగా లేదు అని ఇద్దరి మధ్యలో రెండు దిండ్లు పెట్టి ప్రశాంతంగా నిద్రపోతారు తులసి నందు. ఇక పొద్దున వాళ్ళిద్దరూ లేచే సరికల్లా వాసు తలుపులు తీయండి అంటూ తలుపులు బద్దలు కొడుతూ ఉంటాడు..
అసలు ఏమైందో అని కంగారుపడుతూ నందు గబగబా వచ్చి తలుపులు తీస్తాడు. మీరిద్దరూ నన్ను ఎంతలా మోసం చేస్తారని నేను కలలో కూడా అనుకోలేదు అంటూ వాసు వాళ్ళిద్దరిని నిలదీస్తాడు.

ఈ విషయంలో తులసి తప్పు ఏమీ లేదు తప్పంతా నాదే అని నందు తప్పును తన భుజం మీద వేసుకుంటాడు నందు. అమ్మ తులసి నువ్వు కూడా ఇలా తప్పు చేస్తావని అస్సలు అనుకోలేదు అంటూ వాసు అడుగుతాడు. ఇక సస్పెన్స్ రివీల్ చేస్తూ 28 సంవత్సరాల పెళ్లిరోజు శుభాకాంక్షలు అంటూ వాసు ఇద్దరికీ కంగ్రాట్స్ చెబుతాడు. వాళ్ళిద్దరికీ మేటర్ తెలియకపోవడంతో ఇద్దరూ కాస్త రిలాక్స్ అవుతారు.
ఇక రేపటి ఎపిసోడ్ లో వాసు తులసికి నందికి ఇద్దరికీ తన భార్య చేత పసుపు కుంకుమలను అందిస్తాడు. సరిగ్గా అదే సమయానికి దీపక్ వస్తాడు. ఇప్పుడు తులసి వాళ్ళ తమ్ముడు ఎందుకు వచ్చాడు. సరిగ్గా ఈ టయానికి రావాలా దీపక్ కూడా అని నందు లో లోపల భయపడుతూ ఉంటాడు. ఇక ఈ కథను ఎటువైపు మలుపు తిప్పుతారో చూడాలి.