NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప‌శ్చిమ‌గోదావ‌రిలో ఈ మూడు సీట్లు కూట‌మివే… 100 % రాసిపెట్టుకోండి…!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో పాగా వేయాల‌ని జ‌న‌సేన‌.. స‌త్తా చూపించాల‌ని టీడీపీ.. చాలా కృషి చేస్తున్నా యి. రాజ‌కీయంగా పొత్తులు పెట్టుకుని మరీ.. పోటీ చేస్తున్నా.. టికెట్లు పంచుకున్నా.. బ‌ల‌మైన నాయ‌కుల‌కే టికెట్లు ఇవ్వ‌డంతో జిల్లాలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో కూట‌మి గెలుపు ఖాయ‌మైంద‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుపు క‌ష్ట‌మేన‌ని ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

దెందులూరు: ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మరోసారి వైసీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. ఇక‌, కూట‌మి త‌ర‌ఫున టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పోటీ చేస్తున్నారు. వీరిద్ద‌రిలో చింత‌మ‌నేని ఫైర్ బ్రాండ్ అన్న సంగ‌తి తెలిసిందే. అయితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అంతేకాదు.. రైతుల‌ను బెదిరించార‌ని.. పోల‌వ‌రం పూర్తిచేయలేక పోయార‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి. దీంతో చింత‌మ‌నేని గెలుపు ఖాయ‌మైంద‌ని అంటున్నారు. జ‌న‌సేన నాయ‌కులు , కార్య‌క‌ర్త‌లు కూడా.. ఆయ‌న‌కు అండ‌గా ఉ్నారు.

ఆచంట: ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే చెరుకువాడ‌ శ్రీరంగనాథ్‌ రాజు పోటీకి దిగుతున్నారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి పితాని సత్యనారాయణ బరిలోకి దిగుతున్నారు. స‌త్య‌నారాయ‌ణ బీసీ సామాజిక వ‌ర్గం కావ‌డం.. నిదాన‌స్తుడు, ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉన్న నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. దీంతో ఆయ‌న గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని అంటున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే రంగ‌నాథ‌రాజుకు వ‌య‌సు ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

పాలకొల్లు: ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా గుడాల శ్రీహరి గోపాలరావు పోటీ చేస్తున్నారు. కూట మి అభ్యర్థిగా టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్ర‌జ‌ల మ‌నిషిగా గుర్తింపు పొందిన‌ నిమ్మల రామానాయుడు పోటీ పడుతున్నారు. ఇక్క‌డ టీడీపీ గెలుపును ఎప్పుడో రాసిపెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. ఈ ఐదేళ్ల కాలంలో కేవ‌లం నెల రోజుల మాత్రమే నిమ్మ‌ల ఇంటి ముఖం చూశారు. మిగిలిన అన్ని రోజులు ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు. ఇది ఆయ‌న‌కు ఎవ‌ర్ గ్రీన్ మ‌ద్ద‌తు వ‌చ్చేలా చేస్తోంది.

Related posts

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju