NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ దర్యాప్తులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ .. కీలక వ్యక్తుల అరెస్టులకు రంగం సిద్దం..?

Share

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ దుకుడు పెంచింది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. అప్పట్లో స్కిల్ డెవలప్ మెండ్ అధికారిగా బాధ్యతలు నిర్వహించిన అర్జా శ్రీకాంత్ ను విచారించేందుకు గానూ సీఐడీ నోటీసులు జారీ చేసింది. షెల్ కంపెనీల పేరుతో రూ.342 కోట్లు దారిమళ్లించినట్లు గుర్తించిన ఏపీ సీఐడీ ..మొత్తం 26 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాదే ఈ కేసుకు సంబంధించి ముంబాయి, పూణె, ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ తో పాటు పలు నగరాల్లో సోదాలు జరిపిన సీఐడీ అధికారులు సీమెన్స మాజీ ఎండీ సౌమ్యాద్రి శేఖర్ బోస్, డిజైన్ టెక్ ఎంపీ వికాస్ కన్వేల్కర్, సిల్వర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెండ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ముకుల్ అగల్వాల్, మాజీ స్పెషల్ సెక్రటరీ ఘంటా సుబ్బారావు లను అరెస్టు చేసింది. తాజాగా మరింత మందిని అరెస్టు చేసేందుకు సీఐడీ సన్నద్దం అవుతోంది.

turning point in skill development scam

 

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నైపుణ్యాభివృద్ధి పేరిట రూ.3,300 ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు ప్రారంభమైంది. సీమెన్స్ అంతర్జాతీయ సంస్థతో కలిసి శిక్షణ ఇచ్చేలా డిజిటల్ టెక్ ఒప్పందం కుదుర్చుకుంది. పది శాతం వాటా గా జీఎస్టీతో కలిపి చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం రూ.370 కోట్లు చెల్లించింది. మిగిలిన 90 శాతం సీమెన్స్ సంస్థ చెల్లిస్తుందని ఒప్పందంలో ఉంది. అయితే చివరకు తమకు సంబంధం లేదని సీమెన్స్ ప్రకటించింది. 2016 – 18 సంవత్సరాల మధ్య ఈ మొత్తం స్కామ్ జరిగింది. ఈ స్కామ్ వెలుగులోకి రాకముందే అధికారులు ఫైళ్లను మాయం చేశారు.

అయితే అదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో ఈ స్కామ్ బయటపడింది. దీంతో ఈ స్కామ్ పై కేంద్ర ఆదాయపన్ను శాఖ దృష్టి పెట్టింది. గ్లోబల్ సంస్థ సీమెన్స్ ఇంటర్నేషనల్ టీమ్ కూడా తమ కంపెనీ పేరు మీద మోసాలకు పాల్పడ్డారని తేల్చింది. ఈ వ్యవహారంలో తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ పేరు మీద మోసం జరిగిందని సీమెన్స్ నేరుగా వచ్చి వివరణ ఇచ్చింది. దీంతో సీమెన్స్ పేరిట ఈ మోసాలకు పాల్పడ్డారని సీఐడీ తేల్చింది. దీనికి సంబంధించిన అనాటి అధికారులు కూడా కోర్టు ముందుకు వచ్చి వాంగ్మూలాలు ఇచ్చారు. దీంతో సీఐడీ పెద్ద స్థాయిలో అరెస్టులకు సిద్దమవుతోంది.


Share

Related posts

నాగార్జున నోరు తెరిచి మరీ అడిగినా ఆ స్టార్ డైరెక్టర్ కాదన్నాడంటే ఏమనుకోవాలి ..?

GRK

Devatha Serial: గుడిలో రుక్మిణీని దేవుడమ్మ చూసేసిందా.!? ఆదిత్య ను నిలదీసిన సత్య..!

bharani jella

Today Gold Rate: బంగారం ధర జిగేల్.. వెండి పతనం.. నేటి ధరలు ఇలా..!!

bharani jella