NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబుకు చంద్రగిరి వైసీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సవాల్

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి రాష్ట్రంలో బోగస్ ఓట్లపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఒక చంద్రగిరి నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు ఉన్నాయంటూ చంద్రబాబు ఆరోపించారు. దీనిపై చంద్రగిరి వైసీపీ ఇన్ చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు.

లక్ష దొంగ ఓట్లు ఉన్నాయని నిరూపిస్తే నామినేషన్ కూడా దాఖలు చేయనని సవాల్ విసిరారు మోహిత్ రెడ్డి. జగనన్న చేసిన సంక్షేమం, అభివృద్ధే తమను గెలిపిస్తాయని అన్నారు మోహిత్ రెడ్డి. దొంగ ఓట్లతో గెలవాల్సిన ఖర్మ తమకు ఎప్పుడూ లేదని అన్నారు. మా తాత వయస్సు ఉన్న మీరు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం తగదని హితవు పలికారు.

2023 నవంబర్ లో కేవలం నాలుగు రోజుల్లో టీడీపీ వారు 14,200 దొంగ ఫారం 7 లు నింపి దరఖాస్తు చేశారని అన్నారు. ఎన్నికల కమిషన్ విచారణ చేస్తే చాలా మంది టీడీపీ వారు అరెస్టు అవుతారని అన్నారు. అసత్య ఆరోపణలు చేసిన అందరిపైనా పరువు నష్టం దావా వేసి న్యాయస్థానం ముందు, ప్రజల ముందు దోషులుగా నిలబెడతానని హెచ్చరించారు మోహిత్ రెడ్డి. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి అసత్యాలే కొనసాగిస్తే తాను నియోజకవర్గ ప్రజలతో కలిసి పోరాటం చేసేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు. అవసరం అయితే ఆమరణ నిరాహార దీక్షకు సైతం తాను వెనుకాడనని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిన్న హాజరయ్యారు. సీఈసీతో సమావేశం అనంతరం చంద్రబాబు, పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఓట్ల అక్రమాలు జరుగుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేశామని చంద్రబాబు తెలిపారు. దొంగ ఓట్లు వేసుకుంటే తప్ప గెలవలేం అనే తుది నిర్ణయానికి వైసీపీ ప్రభుత్వం వచ్చిందని చంద్రబాబు ఆరోపించారు. ఒక్క చంద్రగిరిలోనే ఫారం-6 కింద 1 లక్ష 15 వేల ఓట్లు ఇచ్చారని తెలిపారు. వాటిలో దాదాపు 33 వేల ఓట్లను ఆమోదించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను సీఈసీకి ఇచ్చామని చెప్పారు. దీనిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.

YSRCP: రాజ్యసభకు ఆ ముగ్గురు .. వైవీతో పాటు ఆ ఇద్దరికీ ఛాన్స్..?

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?