NewsOrbit
బిగ్ స్టోరీ

సీనియర్ మోస్ట్ లు అందరూ జగన్ వైపే అడుగులు..!

జగన్ పాలన మొదలయ్యి అలా ఏడాది పూర్తయిందో లేదో సొంత పార్టీలోనే అసంతృప్తి మెల్లగా తారాస్థాయికి చేరుకుంది. సీనియర్ నాయకులు పదవి వియోగాన్ని తట్టుకోలేకపోతున్నారు. అలాగని వారి బాధ అంతా లోపల దాచుకోకుండా అవకాశం దొరికిన ప్రతిసారి సొంత పార్టీపైనే బురద జల్లుతున్నారు. వీరిలో చాలామంది తమ రాజకీయ జీవితాలను కాంగ్రెస్ పార్టీకే అంకితం చేసిన వారు కాగా ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వైసిపి లాంటి ప్రాంతీయ పార్టీ లో జగన్ లాంటి ఏక నాయకుది ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు. ప్రతికూల పవనాలు మెల్లగా సాగుతూ చివరికి జగన్ వైపు గా రావడానికి పెద్ద సమయం పట్టదు పోవచ్చని విశ్లేషకుల అంచనా.

How Jagan Reddy walked 3,000 km to build a robust campaign to take ...

వివరాల్లోకి వెళితే మొన్న మాజీ మంత్రి మరియు సీనియర్ మోస్ట్ నాయకుడు ఆనం రామనారాయణ రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసిన తీరుని చూశాం. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన ఉమ్మడి ఏపీలో కీలక మంత్రిత్వశాఖకు నాయకత్వం వహించారు. అటువంటి ఆనం ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే గా ఉండడం నామోషీగా కచ్చితంగా ఫీల్ అవుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే మొన్న తన నియోజకవర్గ అభివృద్ధి పనులను అడ్డుపెట్టుకుని అధికారులతో మొదలెట్టి చివరికి అసలు విషయమైన మంత్రుల పనితీరు వరకు విమర్శల వర్షం కురిపించారు. ఇక విజయనగరం జిల్లా లోని ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి గారి సొంత మేనమామ మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు కూడా అదే తీరులో…. ఏడాది కాలంలో కురుపాం లో అభివృద్ధి ఊసే లేదని ఆయన అధికార పార్టీ గాలి తీశారు.

ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు సైతం మంత్రి పదవి దక్కక పోవడంతో తీవ్ర నిరాశ చెంది ఇప్పుడు తన ఆక్రోశాన్ని మరియు ఆవేదనను మెల్లగా వెళ్లగక్కుతున్నాడు. సమయం దొరికినప్పుడల్లా సొంతపార్టీ పైన విమర్శలు చేస్తున్న ఆయన ప్రభుత్వంలో చాలా నిర్లక్ష్యం ఉందని…. ఇదేనా మన పాలన అంటూ తరచూ మీడియా కి ఎక్కుతున్నారు. తాజాగా ఆయన ఆరోగ్య మంత్రి ఆళ్ళ నాని జిల్లా సమీక్షకు వస్తే ఆయన ముందే వైద్య ఆరోగ్య శాఖ అవినీతిమయం అయిపోయిందంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. లంచం ఇస్తేనే తప్ప పనులు జరగడం లేదంటే ఇది మన ప్రభుత్వమేనా అని నిలదీశారు. శానిటైజేషన్ కాట్రాక్టులకు ముంబై నుంచి కాంట్రాక్టర్లకు ఇవ్వడమేంటి అని గద్దించారు.

వీటికి తగ్గట్లు ఇప్పుడు కొత్తగా ఖాళీ అవుతున్న రెండు మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలో ముందే ఫిక్స్ అయిపోయినట్లు వైసిపి వర్గాల్లో టాక్ నడుస్తుండటంతో సీనియర్ మోస్ట్ నాయకుల అసహనానికి అంతే లేకుండా పోయింది. మరి ఇలాంటి విమర్శలు చేస్తే పదవులు దక్కుతాయా లేదా పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకుంటే వారిని పవర్ లో కూర్చో పెడతారా అన్న విషయం పైన ఇన్నేళ్ళ అనుభవం ఉన్న రాజకీయ నాయకులు వారికే తెలియాలి. అసంతృప్తి పరుల సమూహాన్ని జగన్ రాబోయే రోజుల్లో సరైన పద్ధతిలో డీల్ చేయకపోతే పార్టీ కేడర్ ఎక్కడికక్కడ విచ్ఛిన్నం కావడం కాయం. విపక్షాలు బలపడినా ఇబ్బంది లేదు కానీ వైసిపికి స్వంత పార్టీలో పరస్పర విభేదాలు మరియు అసంతృప్తి భావనలు చెలరేగితే విపరీతమైన నష్టం వాటిల్లుతుందని చరిత్రే మనకు చెబుతోంది.

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju

YSRCP Vs TDP: ముందరి కాళ్లకు బంధం అంటే ఇదే కదా..? సంకటంలో టీడీపీ..!

sharma somaraju