NewsOrbit
5th ఎస్టేట్ Featured బిగ్ స్టోరీ

వైవీ 14 నెలలు..! అనేక వివాదాలు..! టీటీడీలో ఇదేమి చిత్రం..!! (పార్ట్ – 1 )

TTD New Board: YSRCP Internal Discussions

టీటీడీ నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రత్యేక ప్రతినిధి

కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ను నియమించారు. 32 మంది తో జింబో కార్యవర్గాన్ని నియమించారు. అంతా బాగానే ఉంది, అయితే పాలకవర్గం తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు ప్రతీసారి వివాదాస్పదమవుతోంది..! తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే హిందువుల మనోభావాలు తో ముడిపడి వున్న పెద్ద అంశం. టీటీడీకి దేశవ్యాప్తంగా ప్రతిష్ట ఉంది. తిరుమలలో జరిగే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసేందుకు, పరిశీలించేందుకు జాతీయ మీడియా సైతం సిద్ధంగా ఉంటుంది.!! టీటీడీ చైర్మన్ పోస్ట్ కు ఎంత ప్రతిష్ట ఉంటుందో.., అంతకంటే పెద్ద బాధ్యత ఉంటుంది. అదో ఎర్ర తివాచి అంచుల్లో పరిచిన ముళ్లబాట. ఎంతో మంచి పేరు మూటగట్టుకున్నా…, ఒక్క చిన్న పొరపాటు పనితో పాతాళానికి పడిపోవడం కనిపిస్తుంటుంది.!

ttd chairman yv subba reddy confusion by taking decisions
ttd chairman yv subba reddy confusion by taking decisions

జగన్ ప్రభుత్వం వచ్చాక సొంత బాబాయి వై.వి.సుబ్బారెడ్డి ని చైర్మన్ గా నియమించారు. ఆ నియామకం నుంచే వివాదాలు మొదలయ్యాయి. అవి కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి చాలా వరకు టీటీడీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు ఒక ఎత్తయితే, అధికారులు అంతర్గతంగా తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువు అవుతున్నాయి.

Also Read Part 2 >> వైవీ 14 నెలలు..! వివాదాలు – విజయాలు – పార్ట్ –2

ప్రతిసారి ఒక నిర్ణయాన్ని లీకులు ఇవ్వడం. దానిపై వ్యతిరేకత రాగానే దానిని ఖండించుకునే పోవడంతోనే సరిపోతుంది. హిందువుల మనోభావాలతో ముడిపడి ఉన్న నిర్ణయాలను ముందుగా ఏకపక్షంగా తీసుకోవడం తర్వాత ప్రజలు, ప్రజా సంఘాలు పార్టీల నుంచి వ్యతిరేకత రాగానే విరమించుకోవడం వల్ల టిడిపి ప్రతిష్ట మసకబారే అవకాశం ఉంది.!!

ఎన్నో ఎన్నెన్నో ఉదాహరణలు..!!

వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలో టిటిడి బోర్డు ఏర్పాటు సుమారు 14 నెలలు కావస్తోంది. ఈ సమయంలో ప్రతి అంశం వివాదంగా మారుతోంది. ఒకటి ముగిసిన వెంటనే మరొకటి టీటీడీ ముందుకు తీసుకు రావడం పరిపాటిగా మారింది.

* టిటిడి బోర్డు చైర్మన్ గా వై వి సుబ్బారెడ్డి నియామక మే వివాద మైంది. ఆయన హిందువు కాదంటూ ఆయన ప్రతిసారి చర్చిలకు వెళ్తారు అంటూ ఓ వర్గం దాన్ని వివాదం చేసింది. అయితే దాన్ని వైసిపి సోషల్ మీడియా విభాగం గాని, ఇతర వర్గాలు గాని సమర్థంగా తిప్పి కొట్టి కలిగాయి. వై వి సుబ్బారెడ్డి సన్నిహితులు ఆయన పక్కాగా హిందూ అని, ఆయన భార్యకు అపరిమిత భక్తి అని చాటి చెప్పారు. అలాగే ఆవిడ ప్రతి ఏడాది తిరుమలకు వచ్చే చిత్రాలను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టడంతో ఆ వివాదం సద్దుమణిగింది..!

* తిరుమలకు వచ్చే ఆర్టీసీ బస్సుల టిక్కెట్లపై జెరుసలేము యాత్ర కు సంబంధించిన వివాదం టీటీడీ ని కుదిపేసింది. టికెట్లు మాటున అన్యమత ప్రచారం చేస్తున్నారని దుమారం రేగింది. పాలకవర్గం కొలువుతీరిన తర్వాత అతి పెద్ద వివాదం ఇదే. దీన్ని మీడియా సంస్థలు పెద్దవిగా చూపడంతో దానిపై విచారణ నిర్వహిస్తున్నట్లు బోర్డు తెలిపింది. ఆర్టీసీ టికెట్ల వ్యవహారం లో టిటిడి కు ఎలాంటి సంబంధం లేకుండా టిటిడి దీనిపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ టికెట్ల మీద కొన్ని సంస్థలు ప్రచారం నిర్వహించుకోవచ్చు. దీనికి ప్రతిఫలంగా ఆర్టీసీ కి కొంత డబ్బులు ఇస్తారు. అయితే తిరుమలకు వెళ్లే బస్సుల్లో భక్తులు ఇచ్చే టికెట్ల లో అన్యమత ప్రచారం తాలూకా పోకడలు కల్పించడం, ఆర్టీసీ అధికారులు సమాధానం చెప్పాల్సిన విషయం.! తర్వాత దీనిపై విచారణకు నియమించిన సంఘం సైతం ఇదే ధ్రువ పరిచింది.!

* ఇక మరో ముఖ్య వివాదం..! ఎన్నికలు పూర్తయిన తర్వాత ప్రధాని మోడీ తిరుమలకు వచ్చారు. ఆయన వెంటనే సీఎం హోదాలో జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆలయ ఉన్నతాధికారి ఒకరు ప్రధాని మోడీ కు బహుకరించాలి అనుకున్న ఒక నమూనా పెద్ద దుమారం రేపింది..! శ్రీవారి ఆలయం మ్యూజియం నుంచి పురాతన నాణేలు సేకరించి ఒక వరుస క్రమంలో పెట్టి సుమారు 18 విలువైన నాణేలలతో ఒక ఫ్రేమ్ కట్టించి ఇవ్వాలని దాన్ని విజయవాడలో తయారు చేయించారు..! శ్రీవారి మ్యూజియం నుంచి విలువైన నాణేలు బయటకు వెళ్లడం ఉండదు.., ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధం. అందులోనూ ఒరిజినల్ నాణేలతో బహుమతులు ఇవ్వడం అనే ఆనవాయితీ టిటిడి కు లేదు.! శ్రీవారి ఆలయం లోపల ఎలాంటి మీడియా ఉండదు కాబట్టి గోప్యంగా ప్రధానికి ఈ విలువైన బహుమతి ఇవ్వాలని ఒక ఉన్నతాధికారి భావించారు. అయితే ఇది బయటపడడంతో అప్పటికప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. నాణాలను తీసేసి, ఎక్కడివి అక్కడ పెట్టేసి వాటి చిత్రాలతో కూడిన ఒక ఫోటో ఫ్రేమ్ ప్రధానికి సమర్పించారు..! అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.. ఆధారాలతో సహా కొన్ని పత్రికల్లో కథనాలు రావడంతో దీనిపై ఆలయ అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.!

Also Read Part 2 >> వైవీ 14 నెలలు..! వివాదాలు – విజయాలు – పార్ట్ –2

* దేశ రాజధాని ఢిల్లీలోని శ్రీవారి ఆలయంలో లోకల్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వారి నిధుల దుర్వినియోగం అంశం టీటీడీ లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టింది.. విజిలెన్స్ విచారణలో ఏకంగా 4.50 కోట్లు అవినీతి జరిగినట్లు నివేదిక బయటకు రావడం పెద్ద చర్చకు దారితీసింది.. గత ప్రభుత్వంలో జరిగిన కొన్ని రాజకీయ కార్యక్రమాలకు నిధులు వినియోగించినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది.. లోకల్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ గా ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.. అయితే తర్వాత ఆ నిధులు వెనక్కి తీసుకోవడం లేదా విచారణ కొనసాగించడం లాంటి పనులను చేయక పోవడం.. నిందితులకు టిటిడి ఉన్నతాధికారులు సైతం వంత పాడడం టిటిడి లో జరుగుతున్న అవినీతి తంతుకు ఉదాహరణగా నిలిచింది.!!

ఇక మరిన్ని వివాదాలు.., అదే సమయంలో టీటీడీ అభివృద్ధికి చేసిన కొన్ని మంచి పనులూ.., వైవీ తీసుకొచ్చిన సంస్కరణలు కూడా తర్వాత కథనంలో చెప్పుకుందాం..!!

author avatar
Special Bureau

Related posts

Telangana Lok Sabha Elections 2024: ఆ మూడు స్థానాల్లో కొనసాగుతున్న సస్పెన్స్ .. మరో సీఎం రేవంత్ హస్తినకు పయనం

sharma somaraju

ర‌ఘురామ సీటుకు ఎర్త్ పెడుతోందెవ‌రు… పాపం ఏమైపోతాడో …!

ఈ టీడీపీ సీనియ‌ర్ లీడ‌ర్‌కు టిక్కెట్‌…. మంత్రి ప‌ద‌వి కావాలి.. అయినా బాబు కంటే జ‌గ‌నే ఇష్టం…!

బొత్స త‌న భార్య ఝాన్సీని విశాఖ ఎంపీని చేస్తాడా.. చేతులెత్తేస్తారా…?

VN Aditya: అమెరికా జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ఆఫ్ పీస్ నుంచి గౌరవ డాక్టరేట్ పొందిన ప్రముఖ దర్శకులు వీఎన్ ఆదిత్య

siddhu

Chandrababu: ఢిల్లీ వెళుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు .. అమిత్ షాతో కీలక భేటీ..? ఎన్డీఏలో చేరికకు మార్గం సుగమం అయినట్లే(గా)..!

sharma somaraju

YSRCP: ప్రత్యర్ధులకు అందని జగన్ వ్యూహం .. ఎంపీ ఆర్ఆర్ఆర్ కు ప్రత్యర్ధిగా మహిళా అడ్వకేట్ ఉమాబాల .. ఎవరీ ఉమాబాల..?

sharma somaraju

TDP: ఆ వాగ్ధాటి ఉన్న నేతకు టీడీపీలో టికెట్ టెన్షన్ .. బాబు గారు ఎక్కడ సర్దుబాటు చేస్తారో..!

sharma somaraju

JD Lakshminarayana: జేడీ కంఠశోష .. జగన్, చంద్రబాబుకు జేడీ కీలక సూచన

sharma somaraju

TDP – Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు పెద్ద తలనొప్పిగా మారిన కడప అసెంబ్లీ సిగ్మెంట్ .. టీడీపీ కా ..? జనసేనకా..? మాధవి రెడ్డి వర్సెస్ సుంకర శ్రీనివాస్

sharma somaraju

YSRCP: ఎంపీ వద్దు .. ఎమ్మెల్యే సీటు ముద్దు.. వైసీపీ నేతల వేడుకోలు

sharma somaraju

YSRCP – Allagadda: ఆళ్లగడ్డలో అఖిలప్రియకు పోటీగా అవంతి ..? ఎవరీ అవంతి..?  

sharma somaraju

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju

Janasena TDP: జనసేనలోకి మాజీ మంత్రి కొణతాల ..? అయ్యన్న ఆశలపై నీళ్లు..!

sharma somaraju

TDP Vs Janasena: టీడీపీకి బిగ్ ఝలక్ .. తిరగబడుతున్న తెనాలి తెలుగు తమ్ముళ్లు

sharma somaraju