KCR Politics: పక్క సీఎంపైనే నిఘా పెట్టినోడు.. సొంత మంత్రులపై ఓ లెక్కా..!? ఇదో ఇంట్రె”స్టింగు” కేసీఆర్ కథ..!!

KCR Politics: Sting Operation Team KCR
Share

KCR Politics: మనందరికీ తెలిసి కేసీఆర్ అంటే ఒక మాటల మారి.. గొంతుతో గారడీ చేసే ఓ వక్త.. ఏ ఎండకాగొడుగు పట్టె ఫక్తు రాజకీయ నాయకుడు.. అన్ని అనుకూలతలు చూసుకుని ఉద్యమాన్ని ఎగవేసి.. సాధించి, సీఎం కుర్చీ ఎక్కిన ఘనుడు..! అంత వరకే కేసీఆర్ అంటే మనకు తెలుసు. కానీ కేసీఆర్ లో బయటకు కనిపించని ఓ లోతైన మనిషి ఉన్నాడు.. ఎవరికీ అర్ధం కానీ ఓ అధ్యయనకర్త ఉన్నాడు.. ప్రత్యర్థులను అన్ని రకాలుగా వెంటాడే ఓ అధర్మనిషి (అధర్మ మనిషి, అదర్ మనిషి) ఉన్నాడు.. సొంత పార్టీలో తన వ్యతిరేకులు ఎవరు అని కనిపెట్టగల సమర్ధుడు ఉన్నాడు..! చంద్రబాబుని చాణక్యుడు, అపర చాణక్యుడు.., కన్నింగ్ పొలిటీషియన్.., ఊసరవెల్లి అని అంటుంటారు కానీ బయటకు తెలియని.. పూర్తిస్థాయి చాణక్యత, సమర్ధత కలిగిన నాయకుడు కేసీఆర్..! ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. 2015 లో చంద్రబాబుని ఓటుకి నోటు కేసులో ఎంత పకడ్బందిగా ఇరికించాడు..!? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు..!? అదే తరహాలో కేసీఆర్ తన సొంత మనుషులపై కూడా నిఘా పెడుతున్నారు.

KCR Politics: Sting Operation Team KCR
KCR Politics: Sting Operation Team KCR

KCR Politics: ఈటల తరహాలోనే ఇంకొందరు..!?

కేసీఆర్ కి ఎవరిపై అయినా అనుమానం వస్తే వెంటనే అతని చుట్టూ నిఘా బృందం వాలిపోతుంది. ఫోన్లు ట్యాప్ అవుతాయి. షాడో బృందం ఫాలో అవుతుంది. అతని సెర్చ్ డేటా కూడా మొత్తం కేసీఆర్ టేబుల్ పై ఉంటుంది. గూగుల్ లో ఏం వెతుకుతున్నారు..? యూట్యూబ్ లో ఏం చూస్తున్నారు..? అనేది కూడా మొత్తం తెలిసిపోతుంది. అంత స్ట్రాంగ్ వ్యవస్థ కేసీఆర్ తయారు చేసుకున్నారు. అందుకే ఈటల టీఆరెస్ నుండి బయటకు బహిష్కరించబడ్డాడు.. కేసీఆర్ నిఘాలో దొరికాడు కాబట్టే.. ప్రత్యర్థులతో చేతులు కలిపిన సంగతి రెడ్ హ్యాండెడ్ గా కేసీఆర్ కి తెలిసింది కాబట్టే.., పార్టీ అంతర్గత వ్యవహారాలను కేసీఆర్ శత్రువులకు చేరుస్తున్నాడు కాబట్టే ఈటలపై వేటు పడింది. ఇది తెలుసుకొని కూడా కొందరు జాగ్రత్తగా ఉండకపోతే ఎలా..!? అందుకే కేసీఆర్ సొంత మనుషుల్లో.., సొంత మంత్రివర్గంలో ఇంకో ఇద్దరు మంత్రులపై కత్తి వేలాడుతుంది. ఇటీవల ఓ మంత్రి తన కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో ఏకంగా కేసీఆర్ వ్యతిరేక కుంపటి మీటింగ్ పెట్టారు. టీఆరెస్ లోనే కేసీఆర్ అంటే గిట్టని కొందరు ఎమ్మెల్యేలు, నాయకులతో ప్రత్యేక మీటింగ్ పెట్టారు. ఈ వీడియోలు, మొత్తం రికార్డింగులు కేసీఆర్ కి చేరిపోయాయి. దీంతో ఆ మంత్రిపై ఒక వారం రోజుల్లోనే బహిష్కరణ కత్తి వేలాడనున్నట్టు తెలుస్తుంది. ఆయనతో పాటూ తరచూ టచ్ లో ఉంటూ.. వాట్సాప్ కాల్స్ ఎక్కువగా మాట్లాడుకుంటున్న మరో మంత్రి, నలుగురు ఎమ్మెల్యేల విషయం కూడా కేసీఆర్ కి చేరింది. ఇప్పుడు టీఆరెస్ లో ఇదే పెద్ద లొల్లి..

KCR Politics: Sting Operation Team KCR
KCR Politics: Sting Operation Team KCR

ఆ ఐదుగురిపై గట్టి నిఘా..!?

కేసీఆర్ మంత్రివర్గంలో అందరికీ కేసీఆర్ అంటే గిట్టకపోవచ్చు. తనకు శత్రువులు ఎవరూ.. సందు చూసి దెబ్బ వేయాలనుకుంటున్నది ఎవరో తెలుసుకోవటం కేసీఆర్ కి పెద్ద కష్టమేమి కాదు. అలా తనకు బాగా అనుమానముమ్మ అయిదుగురు మంత్రులపై కేసీఆర్ నిఘా ఎప్పుడు ఉంటుంది. వారిలో టీఆరెస్ లో కీలక నేత కూడా ఒకరు ఉన్నారు. మరో ఇద్దరు టీడీపీ నుండి టీఆరెస్ లోకి దూకిన మంత్రులు.. వారితో సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేల సంగతి సరేసరి..

సాంకేతికతని సమర్ధంగా.. తనకు అనుకూలంగా వాడుకోవడంలో కేసీఆర్ దిట్ట. తన పరిపాలనపై ఎవరు, ప్రాంతంపై ఏమనుకుంటున్నారో కూడా కేసీఆర్ తెలుసుకుంటారు. డిజిటల్ మీడియాల్లో తనకు అనుకూల కథనాలను ఏ ప్రాంతంలో ఎక్కువ మంది చూసారో తెలుసుకుని.. ఆ ప్రాంతం తనకు అనుకూలం అని…, తనకు వ్యతిరేక మీడియా కథనాలను ఏ ప్రాంతం వారు ఎక్కువగా చూసారో తెలుసుకుని వారు తనకు వ్యతిరేకం అనీ ప్రాధమిక అంచనాకు వస్తారు. అలా సొంతంగా కొందరు నిపుణులైన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారానికోసారి ఆ నివేదికల ఆధారంగా చర్యలు, సమీక్షలు ఉంటాయి..!


Share

Related posts

మంత్రులతో మోదీ భేటీ

Siva Prasad

పీకల వరకు వస్తేనే పవన్ స్పందిస్తారా?? కమిటీలు ఇప్పుడు గుర్తు వచ్చాయా?

Comrade CHE

‘జగన్ రెడ్డి అంటే తప్పేమిటి!?’

somaraju sharma